Janasena: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు.. అధికారిక ప్రకటన!
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు.
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు.
జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ నెల 14న పిఠాపురంలో పార్టీ 12వ ఆవిర్భావ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. సభలో పార్టీ నిర్మాణంపై పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని చెప్పారు.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజైంది. మొత్తం ఐదు స్థానాల్లో జనసేన, బీజేపీలకు చెరోకటి వెళ్తాయి. మిగిలిన 3 స్థానాలు టీడీపీ నేతలకు దక్కనున్నాయి. జనసేన నుంచి నాగబాబుకు ఇప్పటికే బెర్త్ ఫిక్స్ కాగా.. పిఠాపురం వర్మకు డౌటేనని తెలుస్తోంది.
తెలంగాణ వాళ్లకి తాము తెలంగాణ అనే భావం ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్లకి కులాలు అనే భావన తప్ప, మేం ఆంధ్రులం అనే భావన లేదన్నారు పవన్ కళ్యాణ్. తమలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూటమిలో కలిసే ఉంటామని 15 ఏళ్ల పాటు కలిసే అధికారంలో ఉంటామని చెప్పుకొచ్చారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హుందాగా వ్యవహరించాలని పవన్ జనసేన నేతలకు సూచించారు. వైసీపీ భాష, బురద రాజకీయాలు అనుసరించొద్దని హెచ్చరించారు. సభ్య మర్యాదను కాపాడుతూ.. జనసేన పార్టీ సామాన్యుడి గొంతుగా ఉండాలన్నారు.
ప్రకాశం జడ్పీ చైర్మన్ పదవిని జనసేనకు దక్కేలా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా జనసేనకు తొలి జడ్పీ పీఠం అందించడంతో పాటు.. జిల్లాలో వైసీపీని దెబ్బకొట్టాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది.