PawanKalyan: తమిళనాడులో జనసేన.. పవన్ సంచలన ప్రకటన!

''నేను ఏదీ ప్లాన్ చేసుకోలేదు‌. ప్రజల అభీష్టం మేరకు జరగాలని ఉంటే జనసేన కచ్చితంగా తమిళనాడులో అడుగుపెడుతుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పగ తీర్చుకోవాలనే ఉద్దేశం లేని స్టాలిన్ ఉదార ​​వైఖరిని అభినందించాలన్నారు.

New Update
pawankalyan

pawankalyan

తాను ఏదీ ప్లాన్ చేసుకోలేదని, ప్రజల అభీష్టం మేరకు జరగాలని ఉంటే జనసేన కచ్చితంగా తమిళనాడులో అడుగుపెడుతుందని ఆ ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు.తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గుడ్ లీడర్ అని, పగ తీర్చుకోవాలనే ఉద్దేశం లేని ఆయన ఉదార ​​వైఖరిని అభినందించాల్సింద అన్నారు. పార్టీ పెట్టడం ముఖ్యం కాదని, నిలబెట్టుకోవడమే ముఖ్యం అని పేర్కొన్నారు. సినీ నటులు రాజకీయాల్లో వచ్చి గెలవడం అంతా ఈజీ కాదని, అది కేవలం ఎన్ఠీఆర్‌కు మాత్రమే సాధ్యమైందన్నారు. రాజకీయాల్లో ఓపిక ఎంతో అవసరం అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Also Read:Hamas: హమాస్ లక్ష్యంగా ఐడీఎఫ్ దాడులు.. కీలక నేతలు మృతి!

ఓ తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పలు విషయాలపై స్పందించారు. ‘నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి ప్రకటన రానప్పుడు ముందస్తు నినాదాలు విభజనకు దారితీస్తాయి. ఎన్డీయే కూటమి సభ్యుడిగా దక్షిణాదికి సీట్లు కచ్చితంగా తగ్గవు. విభజన రేఖలు లేకుండా భారతదేశం మరింత ఐక్యంగా ఉండాలి. పునర్విభజన జరగలేదు, దానిపై గోడవ చేయడం వల్ల ప్రయోజం ఏమీ ఉండదు. దక్షిణాది సీట్లు తగ్గకూడదు‌, నేను అదే కోరుకుంటాను. నేను ఎప్పుడూ మాట మార్చలేదు‌‌. బలవంతంగా ఏ భాషను రుద్దడాన్ని నేను వ్యతిరేకిస్తాను‌‌. హిందీ మాత్రమే నేర్చుకోవాలని ఎవరు చేప్పలేరు, చెప్ప కూడదు కూడా‌.

Also Read:Tech Mahindra: ఖతార్ లో గుజరాత్‌ కి చెందిన టెక్ మహీంద్రా ఉద్యోగి అరెస్ట్

 సాంస్కృతిక సమైక్యత కోసం నార్త్ ఇండియన్స్ కూడా దక్షిణాది రాష్ట్రాల భాషలైన తెలుగు, కన్నడ, తమిళం కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడి వారు హిందీ వద్దనుకుంటే మరో భాషను నేర్చుకోండి’ అని పవన్ అన్నారు.‘తమిళనాడులో అన్నాదోరై, ఎంజీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటాను. సినీ నటులు రాజకీయాల్లో వచ్చి గెలవడం అంతా ఈజీ కాదు. అది కేవలం ఎన్ఠీఆర్ గారికి మాత్రం సాధ్యమైంది. 9 నెలలలో అధికారంలోకి రావడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఎంజీఆర్‌, ఎన్టీఆర్‌కు వచ్చిన అవకాశం మరెవరికీ రాలేదు. ఎంతో పాపులర్, ఎంత డబ్బు ఉందో అవసరం లేదు.. మన ఐడియాలజీ ఎంత వరకు ప్రజల్లో వెళ్ళిందనేదే ఇంపార్టెంట్. రాజకీయాల్లో ఓపిక ఎంతో అవసరం. రాజకీయాలు అత్యంత కష్టమైన వ్యవహారం. 

ఇక్కడ అందరూ శత్రువులే. పార్టీని పెట్టడం కాదు, దాని నిలబెట్టుకోవడం ముఖ్యం. వ్యక్తిగత జీవితం ప్రభావితం అవుతుంది. విజయ్ కి అనుభవం ఉంది. నేను చెప్పనవసరం లేదు. ఈపీఎస్, విజయ్ కెమిస్ట్రీ వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు. సహజంగా ఏర్పడకుండా రాజకీయ లెక్కల కోసం పొత్తులు కుదిరితే.. ఇరువైపులా ఓట్ల షేరింగ్ జరుగుతుందా అనేది అనుమానమే. టీడీపీ, జనసేన కేడర్ మధ్య కెమిస్ట్రీ కుదిరింది. కానీ ఎఐడీఎంకే, టీవీకే పార్టీల కార్యకర్తల మద్య కెమిస్ట్రీ కుదురుతుందో చెప్పలేం’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

నేను ఏదీ ప్లాన్ చేసుకోలేదు‌. ప్రజల అభీష్టం మేరకు జరగాలని ఉంటే జనసేన కచ్చితంగా తమిళనాడులో ఆడుగుపెడుతుంది. ఎంకే స్టాలిన్ గుడ్ లీడర్. అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ రెస్టారెంట్‌ను మూసేయలేదు. పగ తీర్చుకోవాలనే ఉద్దేశం లేని స్టాలిన్ ఉదార ​​వైఖరిని అభినందించాల్సిందే. కానీ ప్రస్తుతం తమిళనాడు ప్రజల అలోచన వేరగా ఉండచ్చు ఏమో. 

ఎన్డీఏ కూటమిలో ఏఐఏడీఎంకే చేరితే సంతోషం. ఎంజీఆర్ స్థాపించిన ఏఐఏడీఎంకే పార్టీ బాగుండాలి. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి బలమైన నాయకుడు. ఎఐఎడీఎంకే గతంలోను ఎన్ఢీఏతో కలిసి పనిచేసింది‌. కాబట్టి మళ్లీ పోత్తుపెట్టుకోవడం తప్పులేదు, ఎమైనా జరగవచ్చు’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Also Read: Bangladesh: ఢాకాలో భారీగా సైన్యం.. తిరుగుబాటు పరిస్థితులు..!

Also Read: Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. బాలీవుడ్‌ నటిపై దాడి

pawan-kalyan | janasena | tamilanadu | politics | latest-news | telugu-news | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు