Jammu & Kashmir : జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టూరిస్టులపై కాల్పులు !
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు పర్యాటకుల బృందంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు పర్యాటకులు గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అమర్నాథ్ యాత్రకు కొద్దిసేపటి ముందు ఈ దాడి జరగడం కలకలం రేపింది.
Omar Abdullah: సీఎంకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!
సీఎం ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ విమానాశ్రయంపై అసహనం వ్యక్తం చేశారు. ఇండిగో విమానంలో ప్రయాణించగా దాన్ని జైపూర్‌కు మళ్లించారు. మళ్లీ ఎప్పుడు బయలు దేరుతుందనే విషయాన్ని అధికారులు తెలపలేదని గౌరవంగా మాట్లాడే పరిస్థితుల్లో లేమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jammu Kashmir-Supreme Court: ఓసారి కలిసి కూర్చుని మాట్లాడుకోండి.. సీఎం విడాకుల కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన భార్యతో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఒమర్ అబ్దుల్లా, తన భార్యతో కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్లో మిస్టరీ మరణాల కేసు.. ఆరోగ్యశాఖ కీలక ప్రకటన
జమ్ము కశ్మీర్‌లోని బధాల్ గ్రామంలో ఇటీవల 17 మంది అనుమానస్పద రీతిలో మృతి చెందడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా అక్కడి ప్రభుత్వం అసెంబ్లీలో స్పందించింది. మృతుల శరీరాల్లో విష పదార్థాల అవశేషాలు ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించామని పేర్కొంది.
BIG BREAKING: జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి
జమ్మూ కశ్మీర్లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. రాజౌరిలోని సుందర్‌బాని ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొత్తం నాలుగు రౌండ్లు ఉగ్రవాదులు కాల్పులు కలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో భారీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఐఈడీ బాంబు పేలడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబు దాడిని భారత సైనిక దళానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ నిర్ధరించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది.
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం
న్యూఢిల్లీ నుంచి జమ్మూ కశ్మీర్ కత్రా వెళ్తున్న వందే భారత్ రైలులో నాన్ వాజ్ నిషేధం. పవిత్రమైన శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే భక్తులు రైలులో స్వచ్ఛమైన శాఖాహారం అందడం లేదని ఆరోపించారు. దీంతో రైల్వే శాఖ నాన్ వెజ్‌ను నిషేధిస్తున్నట్లు తెలిపింది.
Jammu Kashmir: రాజౌరీ లో ఆగని మిస్టరీ మరణాలు...వైద్యులకు ఇక నుంచి సెలవులు లేవు
జమ్ము కశ్మీర్లో రాజౌరీలో అంతుచిక్కని రోగాలతో ఇప్పటికే 17 మంది మృతి చెందారు.45 రోజుల వ్యవధిలోనే మూడు కుటుంబాలకు చెందిన వారు మరణించారు.ఇప్పటికే రాజౌరీని మెడికల్ ఎమర్జెన్సీగా ప్రకటించగా.. తాజాగా వైద్య సిబ్బందికి ఇచ్చే శీతా కాలపు సెలవులను రద్దు చేసింది
/rtv/media/media_files/2025/04/22/ek3WPJnSQa4H9nl7zw0x.jpg)
/rtv/media/media_files/2025/04/20/PuXexN4YtzZFWWecY25O.jpg)
/rtv/media/media_files/2025/04/16/a2Aysv8LEybke2TC8nZJ.jpg)
/rtv/media/media_files/2025/03/19/ZtzFPUgiGS9hLUOSsmFC.jpg)
/rtv/media/media_files/2025/02/26/afOazGztW0O3ZeVkTlXy.jpg)
/rtv/media/media_files/2025/02/11/bhV26Xui2BPpHIWDBGaf.jpg)
/rtv/media/media_files/HIeBNTWz39TjIE66rolk.jpg)
/rtv/media/media_files/2025/01/24/QdPuAtqNMq6hhqNvVfwa.jpg)