Pahalgam Terror Attack : జమ్మూకాశ్మీర్లో భారీ నిరసనలు.. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న ప్రజలు
టెర్రరిస్టుల దాడికి వ్యతిరేకంగా కశ్మీర్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మృతులు, బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ అక్కడి ప్రజలు, వ్యాపారులు, హోటల్స్ యజమానులు రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఆర్మీకి అండగా ఉంటాం అంటూ నినాదాలు చేశారు.