Kashmir Encounter: జమ్మూ కశ్మీర్‌ లో ఎన్‌కౌంటర్..ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం

జమ్మూకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సౌత్ కాశ్మీర్లోని గుదార్ అటవీ ప్రాంతంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా..ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు.

New Update
Kashmir Encounte

Kashmir Encounter

Kashmir Encounter:  జమ్మూకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సౌత్ కాశ్మీర్లోని గుదార్ అటవీ ప్రాంతంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో భద్రతాదళాలు ఉగ్రవాదులపై ప్రతిగా కాల్పులు జరిపినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందగా.. ఒక అధికారికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. భద్రతా దళాలు అడవిని చుట్టుముట్టాయి.. అక్కడ ముగ్గురు ఉగ్రవాదులు  దాక్కున్నట్లు సమాచారం.

కుల్గాం జిల్లాలోని గుడ్డర్ అడవి ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఆపరేషన్‌ ఒక్కసారిగా ఎన్‌కౌంటర్‌గా మారిపోయింది.వెంటనే స్పందించిన మన జవాన్లు కూడా దీటుగా బదులిచ్చారు. కాగా ఈ విషయాన్ని కాశ్మీర్ జోన్ పోలీసులు X పోస్ట్‌లో ధృవీకరించారు. కచ్చితమైన సమాచారం ఆధారంగా, కుల్గాంలోని గుడ్డర్ అడవిలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఎస్‌ఓజీ, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

 ఇదే సమయంలో జమ్మూ ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు (IB) వద్ద మరో సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి 9:20 గంటల సమయంలో బీఎస్‌ఎఫ్ జవాన్లు ఒక చొరబాటుదారుడిని పట్టుకున్నారు. అతడు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోధా కు చెందిన సిరాజ్ ఖాన్‌గా తేలింది. బీఎస్‌ఎఫ్ జవాన్లు అతడిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయే ప్రయత్నం చేశాడు. వెంటనే కొన్ని రౌండ్లు కాల్పులు జరిపిన బీఎస్‌ఎఫ్ సిబ్బంది, అతడిని సరిహద్దు కంచె వద్ద అదుపులోకి తీసున్నారు. అతడి వద్ద నుంచి కొంత పాకిస్తాన్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇప్పుడు అతడిని విచారిస్తున్నారు. అతడు భారత భూభాగంలోకి ఎందుకు చొరబడాలని ప్రయత్నించాడు అనే విషయం తేలాల్సి ఉంది.ఈ రెండు ఘటనలు మన భద్రతా బలగాల సమర్థతను, అప్రమత్తతను చాటి చెబుతున్నాయి. ఒక వైపు ఉగ్రవాదులతో పోరాడుతూ, మరోవైపు సరిహద్దులను కాపాడుతున్నారు మన జవాన్లు. కుల్గాం ఎన్‌కౌంటర్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు