/rtv/media/media_files/2025/08/05/operation-nagni-2025-08-05-16-52-44.jpg)
Operation Nagni
Operation Nagni:
జమ్మూకశ్మీర్‌లో(Jammu and Kashmir) తీవ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ రోజు కశ్మీర్ లోని కుప్వారా లో భద్రతా దళాలు కీలకమైన కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించాయి. 'ఆపరేషన్ నాగ్ని' (Operataion Nagni) పేరుతో సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు, బీఎస్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ స్థానికంగా కలకలం రేపింది. ఈ సందర్భంగా పోలీసులు ఒక ఉగ్రస్థావరాన్ని గుర్తించారు. ఈ స్థావరంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. కలరూస్ ప్రాంతంలో సంయుక్త దళాలు మూడురోజులుగా ఈ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నట్టు చినార్ కోర్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.
OP NAGNI TOP, Kupwara
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 5, 2025
Based on specific input, a three-day joint search operation was launched by #IndianArmy, @JmuKmrPolice & @BSF_Kashmir in Kalaroos, Kupwara.
During the search, a hideout was busted, which resulted in recovery of one pistol, two magazines, twelve grenades,… pic.twitter.com/pIR0xHdUNZ
కాగా ఈ ఆపరేషన్‌లో గుర్తించిన ఉగ్రవాద స్థావరంలో ఒక పిస్తోలు, రెండు మ్యాగ్జైన్‌లు, 12 గ్రనేడ్లు, ఇతర పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. 370వ అధికరణ రద్దయి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ జరిపిన ఆపరేషన్‌లో ఈ భారీ డంప్ దొరికినట్టు చెప్పారు. దక్షిణ కశ్మీర్‌లో కుల్గాం జిల్లాలో ఐదురోజులుగా అఖల్ దేవసర్‌లో బలగాలు ప్రత్యేకమైన ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఇంతవరకూ ఒక ఉగ్రవాదిని బలగాలు మట్టుబెట్టారు. ఇటీవల 'ఆపరేషన్ మహదేవ్'లో పహల్గాం ఉగ్రవాదులు ముగ్గురిని భద్రతా బలగాలు మట్టుబెట్టగా, జూలై 30న ఆపరేషన్ శివశక్తిలో ఇద్దరు చొరబాటుదారులను భద్రతా బలగాలు హతమార్చాయి.
Also Read:భర్త అత్తమామల వేధింపులు.. భరించలేక సూసైడ్ నోట్ రాసి మరో నవవధువు..!
పహల్గాం ఉగ్రదాడుల అనంతరం వరుసగా భద్రతాదళాలు కశ్మీర్ లోయలోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు కరుడు గట్టిన ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి. తాజాగా ఆపరేషన్ నాగ్ని పేరుతో నిర్వహించిన ఆపరేషన్ లో తీవ్రవాదులకు సంబంధించిన డంప్ పట్టు బడటంతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి.
Also Read:మందుల ధరలు తగ్గాయి: పేద, మధ్యతరగతికి కేంద్రం ఊరట
కుల్లాంలో భద్రతా దళాలు నాలుగు రోజులుగా ఆపరేషన అఖాల్ నిర్వహించగా అందులో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కాగా ఈ ఆపరేషన్ నేడు ఐదో రోజు కూడా కొనసాగింది. ఇక ‘ఆపరేషన్ మహాదేవ్’లో పహల్గాం నరమేధానికి పాల్పడిన ఉగ్రమూకను మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. జులై 30వ తేదీన ఆపరేషన్ శివ్‌శక్తిలో ఇద్దరు చొరబాటు దారులను భద్రతా దళాలు హతమార్చాయి. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దయి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా భారీ ఆయుధ డంప్ దొరకడం గమనార్హం. కాగా ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత వరుసగా తీవ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది.