/rtv/media/media_files/2025/06/26/encounter-in-udhampur-2025-06-26-19-50-46.jpg)
Encounter in Udhampur
BIG BREAKING : అమర్‌నాథ్ యాత్రకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో జమ్మూకశ్మీర్ సమీపంలోని ఉధంపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడం కలకలం రేపింది. మరోవారంలో అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుండగా ఎన్ కౌంటర్ జరగడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆపరేషన్ బిహాలి కోడ్‌నేమ్‌తో నిర్వహించిన ఈ ఎన్‌కౌంటర్ గురించి భద్రతా దళాలు వివరిస్తూ ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్‌లో ఉన్న కురు ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు వివరించారు.
Op BIHALI
— White Knight Corps (@Whiteknight_IA) June 26, 2025
Based on specific intelligence, a joint operation was launched by #IndianArmy and @JmuKmrPolice in the Bihali area of #Basantgarh.
Contact has been established with #terrorists. The #operation is currently in progress.@adgpi@NorthernComd_IA pic.twitter.com/bEbi8O0bu1
ఇది కూడా చూడండి: Surveyor Tejeshwar Murder: పోలీసుల అదుపులో బ్యాంక్ మేనేజర్.. వెలుగులోకి సంచలన విషయాలు
భారతీయ సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆఫరేషన్‌లో ఒక ఉగ్రవాది మరణించినట్లు వివరించారు. నిఘా వర్గాల ఖచ్చితమైన సమాచారం మేరకు సైన్యం, పోలీసులు గురువారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు జమ్మూ జోన్ ఐజీపీ భీమ్ సేన్ మీడియాకు వివరించారు. ఈ ఎన్ కౌంటర్ లో జైష్- ఏ -మొహమ్మద్ (జేఎం) కు చెందిన ఒక ఉగ్రవాదిని హతమార్చినట్లు వివరించారు. అయితే ఘటనలో మరో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగమంచు కమ్ముకుంది. అయినప్పటికీ గాలింపులు కొనసాగుతున్నాయన్నారు.కాగా ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న ముగ్గురు ఉగ్రవాదులు బసంత్‌గఢ్‌లోని ఎత్తైన ప్రాంతంలో దాక్కున్నట్టు గుర్తించామన్నారు.
ఇది కూడా చూడండి: Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్
ఇదిలా ఉండగా జూలై 3 నుంచి ఆగష్టు 9వ తేదీ వరకు అమర్‌నాథ్ యాత్ర సాగనుంది. దీనికోసం పెద్ద సంఖ్యలో యాత్రికులు సిద్ధమవుతున్నారు. వేలాదిమంది యాత్రకు వస్తారని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ కౌంటర్ జరగడంతో యాత్రకు వెళ్లాలనుకునే వారు ఆలోచనలో పడ్డారు. పహల్గాం మారణహోమం గురించి మరవక ముందే మరోసారి అమర్‌నాథ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో ఈ ఎన్ కౌంటర్ జరగడం గమనార్హం.
అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలో భద్రతాదళాలు యాత్ర పొడవున భారీ భద్రతాను ఏర్పాటు చేశాయి. ఈ నెల 25న భద్రతా దళాలు అమర్‌నాథ్ యాత్ర సన్నాహ కార్యక్రమాల్లో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని గండేర్‌బాల్‌లోని బాల్టాల్ బెస్ క్యాంప్‌లో మాక్ డ్రిల్ నిర్వహించారు. గండేర్‌బాల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) పర్యవేక్షణలో ఈ మాక్‌డ్రిల్ జరిగింది.ఈ మాక్ డ్రిల్ జరిగిన మరునాడే ఉధంపూర్ జిల్లాలోని బిహాలి ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగడంతో ఆందోళన నెలకొంది.
ఇది కూడా చూడండి: Maargan: మొదటి ఆరు నిమిషాలతో భయపెడుతున్న ఆంటోనీ 'మార్గన్'! వీడియో చూశారా?