/rtv/media/media_files/2026/02/22/fotojet-41-2026-02-22-21-46-04.jpg)
Jaish terrorist Saifullah
Jaish terrorist Saifullah : మనదేశ భద్రతాదళాల చేతిలో ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తిన్న పాకిస్తాన్ తన ఉగ్ర చర్యలను ఆపడం లేదు. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులు మన చేతిలో కుక్కచావు చచ్చినా తమ పంతం మార్చుకోవడం లేదు. తాజాగా జమ్మూకశ్మీర్లో పాకిస్థాన్ బేస్డ్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మోస్ట్ వాటెండ్ టెర్రరిస్ట్ సైఫుల్లా ను భద్రతా బలగాలు ఆదివారం నాడు మట్టుబెట్టాయి. కశ్మీర్ లోని కిష్ట్వార్ జిల్లాలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. వారిలో సైఫుల్లా కూడా ఉన్నాడు. కాగా సైపుల్లా రెండేళ్లుగా ఇదే ప్రాంతంలో ఉగ్రవాద కార్యాకలపాలు నిర్వహిస్తూ భద్రతా దళాలను ముప్పు తిప్పుతిప్పలు పెడుతున్నాడు. సైపుల్లా ఇప్పటివరకు భద్రతా దళాల నుంచి 20 సార్లు తప్పించుకున్నాడు. అలాంటి ఉగ్రవాది ఎట్టకేలకు హతమైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.
BIG BREAKING
— برهان الدین | Burhan uddin (@burhan_uddin_0) February 22, 2026
Pakistan military regime backed 2 Jaish terrorists, including MOST-WANTED Saifullah, eliminated in an ENCOUNTER with the Indian Army in Kishtwar, Jammu and Kashmir. pic.twitter.com/WVCSo9gUX2
గత కొంతకాలంగా ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ ట్రాపి-ఐ లో భాగంగా జమ్మూకశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాల విశ్వసనీయ సమాచారంతో చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో ఉగ్రవాదులు హతమైనట్టు 'వైట్ నైట్ కార్ప్స్' తెలిపింది. కిష్త్వార్ జిల్లా ఛాత్రూ ఏరియాలోని పసెర్కూట్ ప్రాంతంలో ఉదయం 10.30 గంటలకు ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఆర్మీ, పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించాయి. నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన పాక్ టెర్రరిస్టులు ఈ ప్రాంతంలో ఉన్నట్టు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు.
కొండ పాదాల వద్ద నిర్మించుకున్న మట్టి ఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నట్టు సమాచారం రావడంతో బలగాలు అక్కడకు చేరుకున్నాయి. దళాల రాకను గమనించి ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు వైట్ నైట్ కార్స్ప్ ధ్రువీకరించింది. ఘటనా స్థలి నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయని తెలిపారు. ఛాత్రూ అటవీ ప్రాంతంలో గత నెలలో ఆరుసార్లు ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక సైనికుడు, ఒక ఉగ్రవాది మృతిచెందారు. తాజాగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Follow Us