/rtv/media/media_files/2025/04/26/GFyzK09DAEuMJh5x4HBX.jpg)
Jammu High Alert
Jammu High Alert: భారత్‌లో ఉగ్రదాడులకు ఉసిగొల్పి 28 మంది మరణానికి కారణమైన పాకిస్తాన్ సరిహద్దులోకవ్వింపు చర్యలకు దిగింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా కాల్పులకు దిగింది. భారత్ ఏ క్షణమైన తమపై దాడులు చేస్తుందన్న భయంతో ఎల్ఓసీ వెంబడి భారత పోస్టుల వైపు నిరంతరం కాల్పులు కొనసాగిస్తున్నది. దీంతో అప్రమత్తమైన భారతసైన్యం ఆ కాల్పులను తిప్పికొడుతోంది. పహల్గాంలో అమాయక టూరిస్టులను బలి తీసుకున్న టెర్రరిస్టుల ఏరివేతకు భారత సైన్యం వేటను ముమ్మరం చేసింది. జమ్మూకాశ్మీర్‌లోని అన్ని ప్రాంతాలను అణువణువూ జల్లెడ పడుతోంది.
భారత ఆర్మీ విన్యాసాలు
మరోవైపు రెండు దేశాలు కూడా తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇండియన్ నేవీ అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ సూరత్ నుంచి మిసైల్ టెస్ట్ చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్‌ను కూడా రంగంలోకి దింపింది. రాజస్థాన్‌లో భారత ఆర్మీ యుద్ధ ట్యాంకులతో విన్యాసాలు నిర్వహించింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని పాకిస్తాన్‌కు హెచ్చరికలు పంపింది. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రమూకల కోసం వేట ముమ్మరం చేసిన భద్రతా బలగాలు.. లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లిని మట్టుబెట్టాయి. శుక్రవారం ఉదయం బందిపొరాలోని ఓ ప్రాంతంలో టెర్రరిస్టులు నక్కి ఉన్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బలగాలు తమను సమీపించడంతో టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే అలర్ట్ అయిన జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించి అల్తాఫ్ లల్లిని హతమార్చారు.
Also Read : ఉగ్రదాడికి బిగ్‌బాస్ కంటెస్టెంట్లే ప్రధాన కారణం.. అన్వేష్ సంచలన వీడియో!
ఈ ఎన్ కౌంటర్లో మరో టెర్రరిస్ట్ బుల్లెట్ గాయాలతో పారిపోయినట్టు భావిస్తున్నారు. టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. కాగా, గురువారం ఉధంపూర్ జిల్లాల్లో సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా ఎన్ కౌంటర్ జరగగా, ఓ జవాన్ వీరమరణం పొందాడు. మరో ఘటనలో ముగ్గురు లష్కరే టెర్రరిస్టులను జవాన్లు పట్టుకున్నారు. పహల్గాం టెర్రర్ అటాక్ కు ప్రతీకారంగా భారత్ పెద్ద ఎత్తున దాడి చేస్తుందన్న ఆందోళనలో ఉన్న పాక్ ఆర్మీ.. బార్డర్ లో భారీగా బలగాలను మోహరిస్తోంది. బలూచిస్తాన్, అఫ్గానిస్తాన్ బార్డర్ లో ఉన్న టాప్ కమాండర్లను, బలగాలను ఇండియా బార్డర్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ) వద్దకు తరలిస్తోంది. అలాగే జవాన్లకు పాక్ ఆర్మీసెలవులను రద్దు చేసింది. యుద్ధ భయంతోనే పాక్ ఆర్మీ బలగాలను భారీగా తరలిస్తోందని భావిస్తున్నారు.
Also Read : మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!
పాక్ ప్రతీకార చర్యలు
మంగళవారం నాటి పహల్గాం టెర్రర్ అటాక్ పాక్ పనే అంటూ తీవ్రంగా స్పందించిన భారత ప్రభుత్వం బుధవారం పాక్ తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు, పాక్ పౌరులకు వీసాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సింధూ జలాల ఒప్పందం రద్దు నిర్ణయం యుద్ధానికి దిగడమేనంటూ పాక్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. సిమ్లా ఒప్పందం రద్దు, ఇండియన్లకు వీసాలు క్యాన్సిల్ చేసింది. తమ గగనతలం మీదుగా భారత విమానాలు ఎగరవద్దంటూ నో ఫ్లై జోన్‌గా ప్రకటించడంతో పాటు అరేబియా సముద్రంలో రెండు రోజులపాటు మిసైల్ టెస్టులు నిర్వహించనున్నట్టు కూడా ప్రకటించింది.
దీంతోపాటు బార్డర్ లో ఎల్ఓసీ వద్దకు పెద్ద ఎత్తున బలగాలను, యుద్ధ విమానాలను మోహరిస్తోంది. పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ నేవీ కూడా గురువారం అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ సూరత్ నుంచి కీలక మిసైల్ టెస్ట్ చేపట్టింది. మరోవైపు ‘ఆక్రమణ్’ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాఫెల్, మిరాజ్, సుఖోయ్ ఫైటర్ జెట్లతో భారీ కసరత్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య బార్డర్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.
Also Read : బీచ్‌లో బుసలు కొడుతున్న సుప్రిత.. హాట్ అందాలకు కుర్రకారు ఫిదా
మెడికల్ ఎమర్జెన్సీ..
జమ్మూ కాశ్మీర్‌లో కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, జమ్మూ లోని సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సిబ్బందంతా విధుల్లో పూర్తిగా హాజరై ఉండాలనీ, అవసరమైతే వెంటనే సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్‌లో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో జీఎంసీ జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు. జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలనీ, ఏదైనా అత్యవసర పరిస్థితికి పూర్తి సంసిద్ధతను నిర్ధారించుకోవాలని ఆదేశించారు.
అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఏ క్షణమైనా అందుబాటులో రోగులకు సేవలు అందించే విధంగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. స్టోర్ ఆఫీసర్, స్టోర్ కీపర్లు అవసరమైన వస్తువులు, అత్యవసర మందులు, కీలకమైన పరికరాలను తక్షణ ఉపయోగం కోసం సిద్ధంగా ఉంచాలని ప్రత్యేకంగా ఆదేశించారు.
Also Read : నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..
24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు
అలాగే, సెలవులు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. విధుల్లో ఉన్న సమయంలో ఆస్పత్రి ప్రాంగణంలోనే అందుబాలులో ఉండాలని పేర్కొన్నారు. అత్యవసర ప్రతిస్పందనలను సమన్వయం చేయడానికి 24×7 కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుంది. ఏదైనా అత్యవసర సహాయం కోసం ఈ క్రింది నంబర్లలో సంప్రదించవచ్చని 0191-2582355, 0191-2582356 నెంబర్లను వెల్లడించింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలనీ, పూర్తిగా సహకరించాలని ప్రభుత్వం కోరింది.