/rtv/media/media_files/2025/05/27/omKIgsYTWi0yQkMmpV4A.jpg)
Jammu and Kashmir Cabinet Meeting
Jammu and Kashmir Cabinet Meeting: జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఉగ్రదాడులకు భయపడే ప్రసక్తే లేదని చాటిచెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన చోటే కేబినెట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. పిరికిపంద చర్యలకు తాము ఏమాత్రం భయపడబోమనే సందేశం టెర్రరిస్టులకు చేరేలా జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఈ సమావేశం నిర్వహించింది. జమ్ముకశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాల రాజధాని జమ్ము ప్రాంతాల్లో కాకుండా పహల్గామ్‌లో క్యాబినెట్ భేటీ కావడం ఈ నూతన ప్రభుత్వ హయాంలో ఇదే తొలిసారని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు.
Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!
In Pahalgam to chair a cabinet meeting. We came to express solidarity with the local population. We’ve also come to thank all the tourists who are slowly making their way back to Kashmir & to Pahalgam. pic.twitter.com/VhKVyWV4Kd
— Omar Abdullah (@OmarAbdullah) May 27, 2025
Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
ప్రకృతి అందాలకు నెలవైన పహల్గాంలోని బైసరన్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయారు. దీంతో అప్పటి నుంచి టూరిస్టుల సంఖ్య తగ్గిపోయింది. జమ్మూకశ్మీర్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు, దానిపైనే ఆధారపడిన స్థానిక ప్రజలకు సంఘీభావంగా ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు ఒమర్ మీడియాకు తెలిపారు. 2009 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఉత్తర కశ్మీర్‌లోని గురెజ్, మచిల్, తాంగ్‌ధర్, జమ్ము ప్రాంతంలోని రాజౌరీ, పూంచ్‌లో ఇలా క్యాబినెట్ మీటింగ్స్ నిర్వహించారు. ప్రధాని మోదీ అధ్యక్షత వహించే నీతిఆయోగ్ సమావేశాన్ని కూడా ఇక్కడే నిర్వహించాలని కోరారు. పహల్గాం క్లబ్‌లో జరిగిన మీటింగ్ మీడియోలు, ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేశారు. జమ్ముకశ్మీర్ దృఢంగా నిలబడుతుందని ఆ పోస్టులో ఒమర్ అబ్ధుల్లా పేర్కొన్నారు.
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!