/rtv/media/media_files/2025/08/25/bans-use-of-pen-drives-and-whatsapp-2025-08-25-18-00-30.jpg)
pendrives and WhatsApp ban
జమ్మూ కాశ్మీర్(Jammu and Kashmir) ప్రభుత్వం సైబర్‌సెక్యూరిటీ(Cyber Security) ని బలోపేతం చేయడానికి సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో సెన్సిటీవ్ సమాచారాన్ని భద్రంగా ఉంచడానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లోని అన్ని అధికారిక కంప్యూటర్లలో పెన్‌డ్రైవ్‌ల వాడకాన్ని నిషేధించారు. అధికారిక సమాచారం బట్వాడాకు వాట్సప్ మెసేజింగ్ సర్వీస్‌ను కూడా నిషేధించింది. సైబర్ అటాక్ ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. సివిల్ సెక్రటేరియట్, జిల్లా డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లోని అన్ని పరిపాలన విభాగాలకు ఈ నిబంధన వర్తిస్తుంది.
J&K Government issues order prohibiting the use of pen drives on all official devices to enhance data security. pic.twitter.com/b6KuTctNuc
— ANI (@ANI) August 25, 2025
Pen Drives - WhatsApp Banned From Government Office
ఈ నిషేధానికి ప్రధాన కారణం డేటా భద్రతను పటిష్టం చేయడమేనని అధికారులు పేర్కొన్నారు. పెన్ డ్రైవ్(Pen Drive) ల ద్వారా మాల్వేర్, వైరస్‌లు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, సున్నితమైన సమాచారం అనధికారికంగా బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలను నివారించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెన్ డ్రైవ్‌లతో పాటు, వాట్సాప్ వంటి పబ్లిక్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ కూడా ఉపయోగించకుదని ఉత్తర్వులో ఉంది. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ఆఫీస్ అవసరాల కోసం పెన్ డ్రైవ్‌లను ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది. దీనికి సంబంధిత ఇంచార్జ్ నుంచి జాతీయ సమాచార కేంద్రం(NIC)లోని స్టేట్ ఇన్ఫర్మాటిక్స్ ఆఫీసర్ (SIO)కి అధికారికంగా అభ్యర్థన పంపాలి. అనుమతి లభించిన తర్వాత, పెన్ డ్రైవ్‌ను NIC సెల్‌కు సమర్పించాక మాత్రమే ఉపయోగించాలి.
పెన్ డ్రైవ్‌లకు బదులుగా ప్రభుత్వం 'GovDrive' అనే క్లౌడ్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి 50 GB సురక్షిత నిల్వ స్థలాన్ని అందిస్తుంది. ఈ ఆదేశాలను పాటించడంలో విఫలమైతే, సంబంధిత నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మార్గదర్శకాలను తక్షణమే అమలు చేయాలని అన్ని విభాగాలకు సూచించింది. ఈ చర్యలు సురక్షితమైన మరియు సురక్షితమైన ఇ-గవర్నెన్స్ కోసం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.