India Pakistan War 2025: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం.. ఇప్పటివరకు జరిగింది ఇదే..!

భారత్-పాక్ యుద్ధం కొనసాగుతోంది. పాక్ దాడుల‌కు భారత్ కౌంటర్ ఇస్తోంది. భారత్‌లో 15, పాక్‌లో 9 నగరాల్లో దాడులు జరిగాయి. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ S-400 సిస్టంతో అడ్డుకుంది. ప్రాణ, ఆస్తి నష్టం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖ తెలిపింది.

New Update
India Pakistan War 2025

India Pakistan War 2025

India Pakistan War 2025: భారత్- పాకిస్థాన్ మధ్య మళ్లీ తీవ్ర యుద్ధం మొదలైంది. ఈ యుద్ధానికి పాకిస్థాన్ కారణమైంది. రాత్రి నుంచి రెండు దేశాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. భారత్ S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పాకిస్థాన్ మిస్సైళ్లను అడ్డుకుంటోంది. ప్రస్తుతం ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని భారత రక్షణ శాఖ తెలిపింది.

Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

పాకిస్థాన్ చర్యలు.. 

పాకిస్థాన్ 50కి పైగా డ్రోన్లను భారత్ పైకి ప్రయోగించింది. భారత్ S-400 సిస్టమ్ ద్వారా వాటిని అడ్డుకుంది. భారత్ లాహోర్‌లో బాంబు పేలుళ్లు జరిపి పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్ ప్రధానంగా జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది. 

 Also Read: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

జోక్యం చేసుకునేది లేదు: జేడీ వాన్స్

అయితే, అమెరికా యుద్ధంలో జోక్యం చేసుకునేది లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్- పాకిస్థాన్ రెండు అణ్వాయుధ దేశాలు కావడంతో, ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఆశిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) తెలిపారు. మరొకవైపు, తాను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

Also Read: Pakistan: ''మా ప్రధాని పిరికివాడు''.. పాకిస్థాన్ ఎంపీ ఫైర్

Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

ఇప్పటివరకు జరిగింది ఇదే.. 

  • పాకిస్తాన్ జమ్మూ(Jammu) టార్గెట్‌గా డ్రోన్ దాడులు చేసింది. ఎయిర్‌పోర్ట్ సహా ఏడుచోట్ల భారీ పేలుళ్లుకు యత్నించింది. భారత సరిహద్దు గ్రామాలపై దాడులు జరిగాయి.
  • భారత్ ప్రతి దాడికి దిగి లాహోర్‌లో బాంబు పేలుళ్లు జరిపి, పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చింది.
  • పాక్ గత రాత్రి నుంచి ఇండియాలోని 15 నగరాలపై దాడులకు యత్నించింది.
  • భారత్ ప్రతి దాడి లో భాగంగా పాక్‌లోని 9 నగరాలపై దాడులు చేస్తోంది.
  • ప్రధానంగా లాహోర్(Lahore), సియోల్‌కోట్‌పై ఇండియన్ ఆర్మీ ప్రతిదాడికి దిగింది.
  • పాక్ దాడులన్నీ జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ లోనే జరుగుతున్నాయి.
  • భారత్ ప్రతీ దాడినీ S-400 సిస్టమ్ ద్వారా అడ్డుకుంటోంది.
  • ఇండియాలోని మిగతా నగరాల్లో హై అలర్ట్ ఉంది.
  • ఇప్పటికే పలు నగరాల్లో విమాన సర్వీసులు రద్దయ్యాయి.
  • ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్రాల సీఎంలు యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు