Hamas-Israel: గాజాలో ఆగని మరణ మృదంగం.. 50 వేలు దాటిన మరణాలు
2023 అక్టోబర్లో ప్రారంభమైన ఇజ్రాయెల్ దాడులు ఇప్పటికీ ఆగడం లేదు. ఇప్పటి వరకు నిర్వహించిన దాడుల్లో 50 వేల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే 1.13 లక్షల మంది గాయపడినట్లు వెల్లడించింది.