/rtv/media/media_files/2025/06/18/idf-says-over-1100-iranian-targets-hit-since-friday-2025-06-18-19-53-21.jpg)
Iran Isreal war
ఇజ్రాయెల్ ప్రస్తుతం ఇరాన్ అణు కేంద్రాలను ఏ విధంగానైనా నాశనం చేయాలని చూస్తోంది. క్షిపణులు, డ్రోన్‌లతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అయితే ఇరాన్ అణు కేంద్రాలను, బాంబు తయారీ శాస్త్రవేత్తలు ఉండే వారి స్థావరాలతో పాటు సైనిక స్థావరాలను కూడా తాకినట్లు తెలుస్తోంది. కానీ ఇరాన్ అణు కేంద్రాలను నాశనం చేయడం అంత ఈజీ కాదు.
ఇది కూడా చూడండి: Coriander Seed Water: కొత్తిమీర గింజల నీరు ఒక దివ్యౌషధం. దీని ప్రయోజనాలను తెలుసుకోండి!
దాదాపు 300 అడుగుల లోతులో..
ఎందుకంటే అందమైన లోయలు, పచ్చని చెట్లు, భారీ రాళ్ల మధ్య ఇరాన్ ఫోర్డో ఇంధన సుసంపన్న అణు కర్మాగారాన్ని నిర్మించారు. అయితే దీన్ని రహస్యమైన, సురక్షితమైన ప్లేస్‌లో నిర్మించారు. శత్రువులు ఇక్కడికి చేరుకోవడం అసాధ్యం. ఎందుకంటే ఇది రాళ్ల లోపల ఉపరితలం నుంచి 300 అడుగుల దిగువన నిర్మించారు. ఇజ్రాయెల్ క్షిపణులు అసలు వీటిని ఢీకొట్టలేవు. ఆపరేషన్ రైజింగ్ లయన్‌లో భాగంగా ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు చేయగా.. ఫోర్డో ఇంధన సుసంపన్న అణు కర్మాగారం కాస్త దెబ్బతింది.
ఇది కూడా చూడండి: IND vs ENG : వాళ్లు లేకుండా ఆడటం కష్టమే.. రాహుల్ ఎమోషనల్ కామెంట్స్!
ఇజ్రాయెల్ క్షిపణులు దాడులు చేసినా కూడా ఇరాన్ అణు కేంద్రాలను అసలు నాశనం చేయలేదని అంటున్నారు. ఇరాన్‌లోని మతపరమైన నగరమైన కోమ్ సమీపంలో ఈ రహస్య అణు కేంద్రం ఉన్నట్లు 2009లో పాశ్చాత్య నిఘా సంస్థలు తెలిపాయి. అయితే ఈ ప్రదేశంలోకి గాలిలోకి క్షిపణిని ప్రయోగించడం ద్వారా కూడా నాశనం చేయడం అసాధ్యమట.
ఇది కూడా చూడండి: Jagan: 'నేనొస్తే ఆంక్షలెందుకు'.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
తాజాగా ఇజ్రాయెల్ పైకి ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్‌లోని ప్రధాని ఆస్పత్రి సోరోఖాపై కూడా బాంబు దాడి జరిగింది. ఈ దాడుల్లో ఆస్పత్రి ధ్వంసమయ్యింది. బాంబులు పడటంతో పేషెంట్లు, డాక్టర్లు బయటకు పరుగులు పెట్టారు. అలాగే శిథిలాల కింద వందలాది మంది పేషెంట్లు చిక్కుకున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ధ్వంసమైన బ్లాక్ బాక్స్ విదేశాలకు..?