ఇరాన్‌కు ఇజ్రాయెల్ మరో స్ట్రాంగ్ వార్నింగ్..!

ఆయుధ తయారీ కేంద్రాల సమీపంలో కూడా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖట్జ్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ఆ ప్రదేశాలను ఖాళీ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదమన్నారు. అయితే ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో బాంబు షెల్టర్లు లేవు.

New Update
iran israel war

Israel-Iran War

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ తీవ్రత రోజురోజుకీ పెరుగుతుంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తూ రెచ్చిపోతుంది. అయితే టెల్‌అవీవ్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివశించే పౌరులు తక్షణమే ఆ ప్రదేశాలను ఖాళీ చేయాలని తెలిపింది. ప్రజల భద్రత కోసం ఈ చెబుతున్నామని వెల్లడించింది.

ఇది కూడా చూడండి:Coconut Barfi: ఇంట్లో కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలి? భలే టెస్టీగా ఇలా చేసుకోండి

వెంటనే ఆ ప్రదేశాలను ఖాళీ చేయమని..

ఆయుధ తయారీ కేంద్రాల సమీపంలో నివశించే ప్రజలు అందరూ కూడా దయచేసి వెంటనే ఆ ప్రదేశాలను ఖాళీ చేయండి. మళ్లీ చెప్పే వరకు ఆ ప్రదేశాల దగ్గరకు రావద్దు. ఇక్కడ ఉండటం చాలా ప్రమాకరమని తెలిపింది. అయితే టెహ్రాన్‌తో పాటు ఆయుధాలు ఉన్న ప్రతీ చోట కూడా దాడులు జరుగుతాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖట్జ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చూడండి:CPI (Maoist) : 20న తెలంగాణ, ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన మవోయిస్టులు

ఇది కూడా చూడండి:G. Kishan Reddy : బీజేపీలోకి చిరంజీవి..కిషన్‌ రెడ్డి సంచలన ప్రకటన

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో బాంబు షెల్టర్లు లేవు. దీంతో ప్రజలు అండర్ గ్రౌండ్‌ పార్కింగ్‌లు, టన్నెల్స్‌, బేస్‌మెంట్లలో ఉండాలని నగర కౌన్సిల్‌ ఛైర్మన్‌ మెహది చమ్రాన్‌ తెలిపారు. అయితే ఇప్పుడు నగరంలోని షెల్టర్లు నిర్మించాలని తెలిపారు. అండర్‌గ్రౌండ్‌ పార్కింగ్‌లను ఇప్పుడు సిద్ధం చేయాల్సి ఉందన్నారు. 

ఇది కూడా చూడండి:Rishab Shetty: భారీ ప్రమాదం.. మృత్యువు అంచుల వరకు వెళ్లిన రిషబ్ శెట్టి!

Advertisment
తాజా కథనాలు