ఓ మహిళ ఏజెంట్ చేతిలో మోసపోయి 22 ఏళ్లుగా పాకిస్థాన్‌లో చిక్కుపోయింది. అప్పడి నుంచి అక్కడ నానా అవస్థలు పడుతూ కాలం వెల్లదీస్తోంది. చివరికి ఓ యూట్యూబర్ ద్వారా ఈ విషయం బయటపడటంతో తాజాగా ఆమె ఎట్టకేలకు భారత్‌కు తిరిగివచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబయికి చెందిన హమీదా బానో అనే మహిళ భర్త గతంలో చనిపోయారు. దీంతో ఆమె దోహా, ఖతర్, సౌదీఅరేబియా దేశాల్లో వంట మనిషిగా పనిచేశారు. Also Read: లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లు.. ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి ఈ పని నుంచి వచ్చే డబ్బులను బానో భారత్‌లో ఉంటున్న తన నలుగురు పిల్లలకు పంపించేది. అయితే 2002లో ఆమె దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ ఓ ఏజెంట్ చేతిలో మోసపోయింది. దీంతో ఆమెను పాకిస్థాన్‌లోని హైదరాబాద్ జిల్లాలో వదిలేశారు. అప్పటినుంచి గత 22 ఏళ్లుగా ఆమె అక్కడే ఉండిపోయారు. అయితే 2022లో వలీవుల్లా మరూఫ్ అనే ఓ యూట్యూబర్ తన బ్లాగ్ కోసం బానోను పలకరించాడు. ఆమె తనకు జరిగిన విషయాన్ని చెప్పింది. బానో పాకిస్థాన్‌లో ఉందని తెలియడంతో ఆమె కుటుంబీకులు తనను భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. Also Read: రాష్ట్రపతి రాకతో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లొద్దు తాజాగా అధికారుల సాయంతో ఆమె లాహోర్‌లోని వాఘా సరిహద్దు మీదుగా భారత్‌కు వచ్చారు. బానో ఇండియాకు తిరిగివచ్చినట్లు విదేశాంగశాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎట్టకేలకు తన కుటుంబ సభ్యులను కలవడంతో బానో ఆనందం వ్యక్తం చేశారు. అసలు భారత్‌కు తిరిగివస్తాననే ఆశ కోల్పోయానని.. కానీ చివరికి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఆమె పాకిస్థాన్‌లో ఉంటున్న సమయంలో కరాచీకి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే కోవిడ్ సమయంలో అతడు కూడా మరణించాడు. Also Read: సర్పంచ్ ఎన్నికలపై కీలక నిర్ణయం.. ఐదేళ్లకొకసారి రిజర్వేషన్లలో మార్పు Also Read: పబ్జీలో పరిచయం.. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.8లక్షలు నష్టం, చివరికి..!