వచ్చే ఏడాది ఫిబ్రవరి(ముందు లేదా తర్వాత)లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులకు సంబంధించి మూడు జాబితాలను విడుదల చేసింది. తాజాగా 38 అభ్యర్థులతో చివరి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో చూసుకుంటే మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక ప్రస్తుత సీఎం అతిషి మళ్లీ కాల్కాజీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు.
Also Read: జమిలి ఎన్నికల బిల్లుకు బ్రేక్.. పునరాలోచనలో పడ్డ కేంద్రం
20 మంది సిట్టింగ్‌లకు నో టిక్కెట్
సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాశ్ నుంచి బరిలోకి దిగగా.. బాబర్‌పుర్ నుంచి గోపాల్‌రాయ్, షారుర్ బస్తీ నుంచి సత్యేందర్ కుమార్ జైన్ పోటీ చేయనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆప్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. కస్తూర్బానగర్ నుంచి ఎమ్మెల్యే ఉన్న మదన్‌లాల్ స్థానంలో రమేశ్ పెహల్వాన్‌ను బరిలోకి దిపింది. బీజేపీ నుంచి బయటికొచ్చిన రమేశ్ పెహల్వాన్.. ఆదివారం ఉదయమే తన సతీమణి కుసుమ్‌లతో కలిసి ఆప్‌లో చేరారు.
Also Read: మాజీ అధ్యక్షుడు అసద్ అరాచకాలు..బందీలను పెంపుడు సింహాలకు ఆహారం
న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్‌కు పోటీగా కాంగ్రెస్ నుంచి దివంగత సీఎం షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ బరిలోకి దిగనున్నారు. ఆప్ పూర్తి ఆత్మవిశ్వాసంతో 70 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టినట్లు కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా తెలిపారు. '' బీజేపీ అదృశ్యమైంది. ఆ పార్టీకి సీఎం అభ్యర్థి లేరు. ఒక టీమ్ కూడా లేదు. ఢిల్లీపై వాళ్లకు ఒక విజన్ లేదు. కేజ్రీవాల్‌ను తొలగించాలన్నదే వాళ్లకు ఉన్న ఏకైక మిషన్ అంటూ'' కేజ్రీవాల్ విమర్శించారు.
Also Read: హనీమూన్‌కి వెళ్లి వస్తుండగా.. ఘోర ప్రమాదం
ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీపై ఒక క్లారిటీ విజన్ ఉందని.. దీన్ని అమలు చేసేందుకు విద్యావంతులతో కూడిన ప్రత్యేక టీమ్ కూడా ఉందని కేజ్రీవాల్ అన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన పనులు ఎన్నో ఉన్నాయని.. రాష్ట్ర అభివృద్ధికి ఎవరు పనిచేశారో వాళ్లకే ఢిల్లీ ప్రజలు ఓటేస్తారని, దూషించేవాళ్లకు కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఒంటరిగా తాము పోటీ చేస్తామని ఇటీవలే కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read : 'బిగ్ బాస్- 8' గ్రాండ్ ఫినాలే ఈ రోజే.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?