🛑LIVE BREAKINGS: లోయలో పడిన ఆర్మీ వెహికల్...ఐదుగురు జవాన్లు మృతి

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS
  • Dec 24, 2024 21:01 IST

    లోయలో పడిన ఆర్మీ వెహికల్...ఐదుగురు జవాన్లు మృతి

    జమ్మూ–కాశ్మీర్‌‌లో ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఇది అదుపు తప్పి 350 అడుగుల లోయలో పడిపోయనట్లు తెలుస్తోంది. దీనిలో ప్రయాణిస్తున్న ఐదుగురు జవాన్లు మృతి చెందారు. మిగతావారు గాయాలతో బయటపడ్డారు. 

    vehicle
    Army Vehicle Photograph: (Google)

     



  • Dec 24, 2024 11:13 IST

    కేసీఆర్, హరీష్ రావు కు హైకోర్టులో బిగ్ రిలీఫ్

    కేసీఆర్, హరీష్ రావు కు హైకోర్టులో ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను సస్పెండ్ చేసింది. వచ్చే నెల 7కే విచారణను వాయిదా వేసింది. 



  • Dec 24, 2024 09:25 IST

    ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ మెరుపు దాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు

    ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో నక్సల్స్‌ మెరుపు దాడి చేశారు. సుక్మా జిల్లాలోని మారుమూల అడవి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫార్వర్డ్ స్థావరాన్ని భద్రపరుస్తుండగా నక్సల్స్‌తో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లలు గాయపడ్డారు.



  • Dec 24, 2024 08:09 IST

    రైల్వే శాఖలో 32,438 ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే?

    రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-D రిక్రూట్‌మెంట్ 2025 కింద 32,438 ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ 23 జనవరి 2025న ప్రారంభమై 22 ఫిబ్రవరి 2025న ముగుస్తుంది.



  • Dec 24, 2024 07:26 IST

    ఏపీలో ఫ్రీ బస్ పథకం.. 2,000 బస్సులు, 11,500 మంది సిబ్బంది అవసరం!

    ఏపీ ఆర్టీసీ అధికారులు మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ పథకం అమలు చేస్తే రోజుకు సగటున 10 లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేశారు. అదనంగా 2వేల బస్సులు, 11,500 మంది సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు.



  • Dec 24, 2024 06:59 IST

    తెలంగాణలో కీచక టీచర్.. నాలుగో తరగతి బాలికలతో, ఛీ ఛీ!

    తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో మరో కీచర్ టీచర్ రెచ్చిపోయాడు. నాలుగో తరగతి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అశ్లీల చిత్రాలు, వీడియోలు చూపించాడు. విషయం తల్లిదండ్రులకు తెలవడంతో అతడికి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు.



  • Dec 24, 2024 06:38 IST

    బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు!

    బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్ననేపథ్యంలో రాష్ట్రంలో కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు ముప్పు పొంచి ఉంది. దీని ప్రభావంతో గురువారం వరకు రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు