Australia: ఆస్ట్రేలియాలో ఎప్పటినుంచో యూదు వ్యతిరేకత.. కాల్పులకు దారి తీసిన కారణాలు ఇవే !

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బోండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడిలో 15 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Australia

Australia

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బోండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడిలో 15 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కాల్పులకు పాల్పడ్డ నిందుతులు తండ్రీకొడుకులకు ఇస్లామిక్ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్ అండ్ సిరియా (ISIS)తో సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుల కారులో రెండు ఐసిస్ జెండాలు, ఘటనాస్థలం నుంచి రెండు IED బాంబులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

 పోలీసుల కాల్పుల్లో నిందితులైన తండ్రి సాజిద్ అక్రమ్‌(50)  మృతి చెందాడు. కొడుకు నవీద్‌ అక్రమ్‌కు తీవ్ర గాయాలుకావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే 2019లో ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి ప్లాన్ చేసినందుకు అక్కడి ప్రభుత్వం ISIS సభ్యుడిని అరెస్టు చేసింది. ఇతనితో నవీద్‌ అక్రమ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తాజా విచారణలో తేలింది. అంతేకాదు కొంతకాలంగా అతడు ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ ఆర్గనైజేషన్ ఏజెన్సీ నిఘా రాడర్‌లో కూడా ఉన్నట్లు గుర్తించారు. కానీ నవీద్‌ నుంచి అంతగా ముప్పు లేకపోవడంతో సరిగా పట్టించుకోలేదని అధికారులు చెప్పారు. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. 

Also Read: వామ్మో.. మెస్సీ ఎడమ కాలుకు వేల కోట్ల ఇన్సురెన్స్‌.. భారత్‌లో మ్యాచ్‌ ఆడకపోవడానికి కారణం అదే !

యూదులపై ఎప్పటినుంచో వ్యతిరేకత

2023 అక్టోబర్‌ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీనిక ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ గాజాలో హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా మారణహోమం సృష్టించింది. దీంతో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పలు దేశాల్లో నిరసనలు జరిగాయి. ఆస్ట్రేలియాలో కూడా యూదు వ్యతిరేకత ఎప్పటినుంచో ఉంది. ఆస్ట్రేలియన్ జ్యూరీ కార్యనిర్వాహక మండలి ప్రకారం.. అక్కడ ఒకే ఏడాదిలో 1600 యూదు వ్యతిరేక సంఘటనలు జరిగాయి. 

1788లో ఆస్ట్రేలియాను బ్రిటిష్ పాలిస్తున్న కాలంలో కొంతమంది యూదు ఖైదీలను అక్కడికి తీసుకొచ్చారు. ఆ తర్వాత యూరప్ నుంచి యూదు వ్యాపారులు, వైద్యులు, నిపుణులు వచ్చి స్థిరపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చాలామంది ఆస్ట్రేలియాకు వచ్చారు. ప్రస్తుతం అక్కడ 120,000 కంటే ఎక్కువమంది యూదులు ఉంటున్నారు. వీళ్లలో అత్యధికంగా సిడ్నీ, మెల్‌బోర్న్‌లోనే ఉంటున్నారు. మొదట్లో యూదుల పట్ల అక్కడ వ్యతిరేకత ఉండేది కాదు. కానీ సామాజిక వివక్ష మాత్రం కనిపించేది. అనేక హోటళ్లు, క్లబ్‌లు, ఇతర సంస్థల్లో యూదులను బహిష్కరించారు. 

Also Read: నేటి నుంచే హెచ్ 1బీ, హెచ్4 వీసాల సోషల్ మీడియా స్క్రీనింగ్..

ఇక 21వ శతాబ్దంలో యుదు వ్యతిరేకత మరింత పెరిగిపోయింది. ఇజ్రాయెల్ విధానాలకు ఆస్ట్రేలియాలో ఉన్న యూదులను బాధ్యులుగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సిడ్నీ, మెల్‌బోర్న్‌లో యూదుల ప్రార్థనా మందిరాలపై కాల్పులు జరిగాయి. యూదుల శ్మసాన వాటికలను ధ్వంసం చేయడం, బహరింగ ప్రదేశాల్లో యూదులను బహిష్కరించాలి అనే నినాదాలు వినిపించాయి. ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన తర్వాత ఆస్ట్రేలియాలో యూదు వ్యతిరేక ఘటనలు మరింత పెరిగిపోయాయి. తాజాగా జరిగిన కాల్పులకు కూడా ISISతో సంబంధాలు ఉన్నాయని తేలింది. దీంతో యూదులకు వ్యతిరేకంగా దాడులు మరింత ముదురుతున్నాయని స్పష్టమవుతోంది. 

ఇదిలాఉండగా సిడ్నీలో జరిగిన ఉగ్రదాడిపై హమాస్ సీనియర్ అధికారి మహ్మద్‌ నజ్జల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ దాడులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిని నెతన్యాహు అంటూ విమర్శించాడు. గాజాలో జరుగుతున్న దాడుల వల్ల ముస్లింలోనే కాకుండా ముస్లిమేతరుల్లో కూడా హింసాత్మక భావాలను రేకెత్తించాయని అన్నారు. పరిస్థితులు మారకుంటే ప్రపంచంలో ఇలాంటి దాడులు వివిధ ప్రాంతాల్లో జరిగే ఛాన్స్ ఉందని హెచ్చరించాడు. 

Advertisment
తాజా కథనాలు