అమెరికా, రష్యా మధ్య గత కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా అమెరికా ఇజ్రాయెల్‌కు సపోర్ట్ చేస్తే.. రష్యా ఇరాన్‌కు మద్దతు పలికింది. అయితే తాజాగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నారు. ఇప్పుడు అమెరికా, రష్యా మధ్య స్నేహబంధం పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను.. రష్యా అధ్యక్షుడు పుతిన్ పొగడ్తలతో ముంచేత్తారు. '' ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ట్రంప్ చాలా ధైర్యవంతుడు. రెండుసార్లు హత్యాయత్నం నుంచి బయటపడ్డాడు. త్వరలోనే నేను ట్రంప్‌ను కలుస్తానని'' పుతిన్ అన్నారు.
Also Read: మళ్లీ ఉగ్రవాద శిబిరాలు నిర్మిస్తున్న పాకిస్థాన్.. వెలుగులోకి సంచలన నిజాలు
ఇదిలాఉండగా అమెరికా, రష్యా యుద్ధం నేపథ్యంలో గతంలో అమెరికా రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రష్యా.. ఉత్తర కొరియాకు మరింత దగ్గరయ్యింది. కిమ్ ప్రభుత్వం కూడా రష్యాకు సైనిక, ఆయుధ సాయం చేస్తోంది. ఇటీవల జరిగిన ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులను రష్యా ఖండించింది. దీంతో అమెరికా, రష్యా మధ్య విభేదాలు మరింత ముదిరాయి. కానీ తాజాగా ఇరుదేశాలు కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ట్రంప్‌ను పుతిన్ పొగడడం.. త్వరలోనే కలుస్తానని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: ఇజ్రాయిల్ ప్రధాని ప్లాన్ ఇదే.. యుద్ధాలతో ప్రజల్ని మార్చుతున్న నెతన్యాహు