Canada: కెనడాలో భారత విద్యార్ధుల నిరసన..భయపెడుతున్న బహిష్కరణ
కెనడాలో భారతీయులతో పాటూ విదేశీ విద్యార్ధులు నిరసనలు చేస్తున్నారు. తమను దేశం నుంచి వెళ్ళగొట్టేస్తారనే భయంతో దాదాపు 70 వేల మంది విద్యార్ధులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రిన్స్ఎడ్వర్డ్ ఐలాండ్తోపాటు,ఒంటారియో, మనితోబా, బ్రిటిష్ కొలంబియాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు.