అమెరికా నుంచి 18 వేల మంది భారతీయలు ఔట్ !

అమెరికాలో 14.40 లక్షల మంది అక్రమంగా ఉంటున్నట్లు ఇమిగ్రేషన్‌ విభాగం ఇటీవలే ఓ జాబితాను విడుదల చేసింది. ఇందులో 18 వేల మంది ప్రవాస భారతీయలు కూడా ఉండటంతో వీళ్లకు డిపోర్టేషన్ ముప్పు ఉండనున్నట్లు తెలుస్తోంది.

New Update
TRUMP2

వచ్చే ఏడాది జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అధికారం చేపట్టిన వెంటనే తాను అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటానని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు అనుగుణంగానే ఆయన అధికారిక ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు కూడా అక్రమంగా ఉంటున్నవారి జాబితాను రుపొందించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే 18 వేల మంది ప్రవాస భారతీయలకు అమెరికాలో డిపోర్టేషన్ ముప్పు ఉండనున్నట్లు తెలుస్తోంది.   

ఇది కూడా చూడండి: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్

ఇదిలాఉండగా.. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారికి సంబంధించి యూఎస్‌ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ICE) కొన్ని రోజుల క్రితమే గణాంకాలు రిలీజ్ చేసింది. ఈ జాబితాలో మొత్తం 14.40 లక్షల మంది ఉన్నారు. ఇందులో 2.61 లక్షల మందితో హోండరస్ మొదటిస్థానంలో ఉంది. గ్వాటెమాలా, మెక్సికో, ఎల్‌ సాల్వెడార్ దేశాలకు చెందిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ లిస్టులో 17,940 మంది భారతీయులు కూడా ఉన్నట్లు ఇమిగ్రేషన్ విభాగం తెలిపింది. అలాగే 37 వేల మంది చైనీయులు కూడా ఈ డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది.    

ఇది కూడా చూడండి: న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే!

అంతేరాదు ప్రస్తుతం యూఎస్‌లో లక్షలాది మంది భారతీయులు అనధికారికంగా ఉంటున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో వీళ్లందరూ చట్టబద్ధత కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఐసీఈ నుంచి క్లియెన్స్‌ రావడం కోసం ఇంకా ఏళ్ల సమయం పట్టనున్నట్లు సమాచారం. మరోవైపు గత మూడేళ్లలో అక్రమంగా అమెరికాలోకి వస్తూ వేలాది మంది భారతీయులు పట్టుబడుతున్నారు .   

ఇది కూడా చూడండి: భార్యల వేధింపులకు భర్తలు బలి.. ఎన్ని ఘోరాలు జరిగాయంటే?

ఇది కూడా చూడండి: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు