AI: ఏఐని తెగ వాడేస్తున్న భారతీయులు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్...ప్రపంచం మొత్తాన్ని మార్చేస్తున్న టెక్నాలజీ. దీన్ని ఇప్పుడు తెగ వాడుతున్నారు. ఇందులోనూ భారతీయులు అయితే ఇంకాను. ఏఐ స్వీకరణలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా మారినట్లు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) పరిశోధన తెలియజేసింది. By Manogna alamuru 13 Nov 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి AI Technology: టెక్నాలజీ...ఇది ఇప్పుడు అందరినీ శాసిస్తోంది. టెక్నాలజీ లేనిదే ప్రపంచం లేదు. ఎంత చిన్న పని చేయాలన్నా టెక్నాలజీ ఉండాల్సిందే ఈరోజుల్లో. దానికి తోడు ఇప్పుడు ఏఐ తోడయ్యింది. మామూలుగానే మన పనిని టెక్నాలజీ ఈజీ చేసేస్తుంది. దానిని మరింత సులభం చేసేసింది ఏఐ. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏఐ టెక్నాజీని వాడుతోంది. అయితే ఇందులో అందరి కంటే భారత్ మరీ ఎక్కువగా ఏఐను ఉపయోగిస్తోందని చెబుతున్నారు. ఏఐ స్వీకరణలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా మారినట్లు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) పరిశోధన తెలియజేసింది. 30 కంపెనీలు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయని తెలిపింది. Also Read: TS:బీజేపీ,బీఆర్ఎస్‌లు కవల పిల్లలు–తెలంగాణ సీం రేవంత్ సంచలన వ్యాఖ్యలు బీసీజీ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 26శాతం మాత్రమే ఏఐని ఉపయోగిస్తుటే..భారతదేశం మాత్రం 30శాతం ఈ టెక్నాలజీని వాడుతోంది. ఫిన్‌టెక్, సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్ రంగాలు తమ కార్యకలాపాలలో AIని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. చాలా ఏళ్లుగా ఏఐపై ఇన్వెస్ట్‌మెంట్ చేయడం, టాలెంట్ పీపుల్ని నియమించడం లాంటివి చేసిన తర్వాత ఇప్పుడు సీఈఓలు వాటి నుంచి ఫలితాలను పొందుతున్నారు. Also Read: BY Poll: రేపు వాయనాడ్‌తో పాటూ 31 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాలోని 59 దేశాలలో విస్తరించి ఉన్న 20 రంగాలకు చెందిన 1,000 మంది చీఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్లు (CxOs), సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సర్వే ఆధారంగా.. ‘‘AI వాల్యూ ఎక్కడ ఉంది..?’’ అనే పేరుతో నివేదిక బీసీజీ రూపొందించింది. ఇది మొత్తం 10 మేజర్ ఇండస్ట్రీలను ఈ సర్వే కవర్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 4 శాతం కంపెనీలు మాత్రమే అత్యాధునిక ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి చేశాయి. అదనంగా 22 శాతం ఏఐ స్ట్రాటజీని అమలు చేశాయి. 74 శాతం కంపెనీలు ఇంకా ఏఐ వినియోగం, దాని రిజల్ట్స్‌ను చెప్పాల్సి ఉంది. Also Read: AP: ఏపీ అసెంబ్లీ ఛీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు Also Read: Jharkhand: రేపే జార్ఖండ్ తొలి విడత పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి #indians #ai #ai-technology #BCG మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి