రెస్టారెంట్లో కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవ్వడంతో 12 మంది చనిపోయారు. ఈ విషాద ఘటన జార్జియా దేశంలోని గూడౌరి మౌంటేన్ రిసార్ట్‌లోని రెస్టారెంట్‌లో సంభవించింది. చనిపోయిన 12 మందిలో 11 మంది భారతీయులు ఉన్నారని జార్జియాలోని ఇండియన్ మిషన్ తెలిపింది. కార్బన్ మోనాక్సైడ్ లీక్ అవ్వడం వల్లే చనిపోయారని ప్రాథమిక నివేదికల్లో తెలిసింది. చనిపోయినవారి శరీరాలపై గాయాలు ఏం లేవని జార్జియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కూడా చదవండి : WHO: ప్రతీ గంటకూ 30 మంది మృతి..డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ రిపోర్ట్ Also Read: TS: వివాదంలో భద్రాచలం లడ్డూ.. అలా ఎందుకు చేశారు? గూడౌరిలోని రెస్టారెంట్‌లోని సెకండ్ ఫ్లోర్ బెడ్‌రూమ్‌లలో మృతదేహాలు పడిఉన్నాయి. వారంతా అదే ఇండియన్ రెస్టారెంట్‌లో ఎంప్లాయిస్ అని గుర్తించారు. బెడ్‌రూమ్‌ల దగ్గర ఉన్న పవర్ జనరేటర్ కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అయ్యిందని అందువల్లే వారు చనిపోయినట్లు తెలుస్తోంది. జార్జియా క్రిమినల్ కోడ్ ఆర్టికల్ 116 కింద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృదేహలకు ఫోరెన్సిక్ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.