భారతీయులు ఇప్పుడు సిరియాకు వెళ్లకండి : ఇండియన్ ఎంబసీ సూచన

సిరియాలో తిరుగుబాటుదారులు హింసకు పాల్పడుతూ ప్రధాన నగరాలను ఆక్రమించుకుంటున్నారు. ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కోరింది. అక్కడున్న వారిని సేఫ్ గా ఉండాలని, వీలైతే ఇండియా తిరిగి రావాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది.

author-image
By K Mohan
New Update
siriya

సిరియాలో పరిస్థితులు బాగాలేవు.. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. సిరియా దేశంలో తిరుగుబాటుదారులు మళ్లీ హింసకు పాల్పడుతున్నారు ఈ క్రమంలో ఆ దేశానికి వెళ్లాలనుకునే వారు ప్రయాణాన్ని కొద్దిరోజులు వాయిదా వేసుకోండని ఇండియన్ ఎంబసీ సూచించింది. అంతేకాదు అక్కడున్న భారతీయులు ఎంత త్వరగా ఇండియా చేరుకుంటే అంత మంచిదని అడ్వైస్ ఇచ్చింది.

Also Read : Gold Prices: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధరలు

సిరియాలో జిహాదీ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ సంస్థ తిరుగుబాటు హెచ్చరికలు జారీ చేసింది. 14 ఏళ్లుగా సిరియాలో జిహాదీ గ్రూప్ హయత్ తహ్రీర్ అల్-షామ్ అనే తిరుగుబాటుదారులు అంతర్యుద్ధం చేస్తున్నారు. తాజాగా తిరుగుబాటుదారులు సిరియాలోని అలెప్పోతో పాటు పలు కీలక నగరాలను స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: బంగాళాఖాతంలో మరో వాయుగుండం..ముంచుకొస్తున్న మూడు తుపాన్లు!

సిరియాలో దాదాపు 90 మంది భారతీయులు ఉన్నారని, వీరితో సహా 14 మంది వివిధ UN సంస్థల్లో పనిచేస్తున్నారని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఉత్తర సిరియాలో ఇటీవలి జరుగుతున్న తిరుగుబాటు కారణంగా భారతీయుల భద్రతకు మేము కట్టుబడి ఉన్నామని శుక్రవారం ఆయన అన్నారు.

Also Read: ఏసీసీ కొత్త అధ్యక్షుడుగా.. శ్రీలంక లెజెండ్

తిరుగుబాటుదారులు సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వ పాలనా కార్యాలయం డమాస్కస్ వైపు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈనేపథ్యంలో సిరియాలో ఇండియన్ జాగ్రత్తగా ఉండాలని భారత విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ అప్రమత్తం చేస్తోంది.

Also Read: America: కొడుకుకే కాదు..మరికొందరికి కూడా..!

Advertisment
తాజా కథనాలు