Martlet Missiles: భారత్ అమ్ముల పొదిలోకి మరో అడ్వాన్స్డ్ ఆయుధం.. ఇక శత్రు దేశాలకు చెమటలే
భారత్ అమ్ములపొదిలోకి మరో అడ్వాన్స్డ్ ఆయుధం రానుంది. భారత్-యూకే మధ్య రక్షణ రంగంలో పరస్పర సహకారంలో భాగంగా కీలక ఒప్పందం కుదిరింది. దీంతో యూకే తేలికపాటి, బహుళ ప్రయోజనకర మిసైల్ సిస్టమ్ అయిన 'మార్ట్లెట్'లను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు అంగీకరించింది.