Indian Navy: భారత నౌకాదళంలోకి INS మహీ.. దీని ప్రత్యేకత ఇదే

భారత నావికాదళం యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా మరో ముందడుగు వేసింది. అత్యాధునిక యాంటీసబ్‌మెరీన్‌ వార్‌ఫేర్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్‌ సిరీస్‌లోని నాల్గవ నౌక 'INS మహీని ఇటీవల విజయవంతగా ప్రవేశపెట్టారు.

New Update
Indian Navy commission INS Mahe

Indian Navy commission INS Mahe

భారత నావికాదళం యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా మరో ముందడుగు వేసింది. అత్యాధునిక యాంటీసబ్‌మెరీన్‌ వార్‌ఫేర్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్‌ సిరీస్‌లోని నాల్గవ నౌక 'INS మహీని ఇటీవల విజయవంతగా ప్రవేశపెట్టారు. ఈ నౌకను పూర్తిగా భారత్‌లోనే తయారుచేశారు. కోచిన్ షిప్‌యార్డ్‌ లిమిటెడ్ ఈ నౌకను నిర్మించింది. ఈ INS మహీ నౌకను ప్రధానంగా యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్‌ ఆపరేషన్ల కోసం నిర్మించారు. 

Also Read: బిగ్‌బాస్‌ మొదట ఎక్కడ పుట్టిందో తెలుసా ?.. దీని అసలు కథ ఇదే

ఈ నౌకలను ముఖ్యంగా తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న సముద్రాల్లో శత్రు దేశాల సబ్‌మెరైన్‌లను గుర్తించడం, వాటిపై దాడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు ఈ నౌకలు శత్రువులకు చిక్కకుండా తక్కువ రాడార్‌ రిఫ్లెక్టివ్ సిగ్నేచర్‌తో నిర్మించారు. మహీ అనేది యాంటీ-సబ్‌మెరీన్ వార్‌ఫేర్ (ASW) ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అమాని క్లాస్‌షిప్‌ సిరీస్‌లో నాల్గవది.  

Also Read: ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR అంటే ఏంటీ? రాజకీయ పార్టీల అభ్యంతరాలు దేనికి?

ఇప్పటికే మొదటి మూడు నౌకలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ తరహా నౌకలకు భారతీయ దీవుల పేర్లే పెట్టారు. భారత నావికాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ దీని గురించి మాట్లాడారు. INS మహీ నౌక జల ప్రవేశం దేశీయ నౌక నిర్మాణ సామర్థ్యాన్ని, సాంకేతికతను మరోసారి పెంచాయని అన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మన భద్రతను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు.  

Advertisment
తాజా కథనాలు