ఇండియా నేవీ మాస్టర్ ప్లాన్.. చైనా, బంగ్లాదేశ్‌ ఆటలకు చెక్!

పశ్చిమ బెంగాల్‌లోని హల్దియాలో కొత్త నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ స్థావరం చైనా నిఘా నౌకల కదలికలను అడ్డుకోవడంతో పాటు, బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా జరిగే అక్రమ చొరబాట్లపై నిఘా పెట్టేందుకు 'ముందు వరుస' కేంద్రంగా పనిచేయనుంది.

New Update
_new naval base in Haldia

బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి కారణంగా పరిస్థితులు ఇండియాకు ప్రమాదకరంగా మారాయి. ఇప్పటి వరకు చైనా ఆగడాలకు బంగ్లాదేశ్ భారత్‌కు తోడుగా ఉండేది. బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభత్వం పడిపోయి యూనస్ తాత్కాలిక ప్రభుత్వం రాగానే బంగ్లాదేశ్ భారత వ్యతిరేక విధాలను పాటిస్తోంది. దీంతో ఇండియా ఇప్పుడు ఒకే వైపు నుంచి ఇద్దరు శత్రువులను ఎదర్కొవాలి. ఇందుకోసం ఇండియన్ నేవీ ఓ కొత్త ప్లాన్ వేసింది. పశ్చిమ బెంగాల్‌లోని హల్దియాలో కొత్త నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ స్థావరం చైనా నిఘా నౌకల కదలికలను అడ్డుకోవడంతో పాటు, బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా జరిగే అక్రమ చొరబాట్లపై నిఘా పెట్టేందుకు 'ముందు వరుస' కేంద్రంగా పనిచేయనుంది.

వ్యూహాత్మక ప్రాధాన్యత
హల్దియా రేవు ప్రాంతం కోల్‌కతాకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. హుగ్లీ నది గుండా ప్రయాణించే సమయాన్ని ఆదా చేస్తూ, నేరుగా బంగాళాఖాతంలోకి ప్రవేశించడానికి ఈ ప్రాంతం నౌకాదళానికి ఎంతో కీలకం. చైనా తన 'స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్' వ్యూహంలో భాగంగా బంగ్లాదేశ్‌లోని మోంగ్లా, చిట్టగాంగ్ పోర్టులలో పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, భారత్ హల్దియాలో ఈ స్థావరాన్ని ఏర్పాటు చేయడం రక్షణ పరంగా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఏయే యుద్ధనౌకలు మోహరిస్తారు?
ఈ కొత్త స్థావరంలో ప్రధానంగా చిన్న, అత్యంత వేగంగా ప్రయాణించే యుద్ధనౌకలను మోహరించనున్నారు.
ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ క్రాఫ్ట్స్ : ఇవి సముద్రంలో అక్రమ రవాణా మరియు చొరబాట్లను అడ్డుకోవడానికి ఉపయోగపడతాయి.
వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్స్: 300 టన్నుల బరువుండే ఈ నౌకలు గంటకు 40-45 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ మెరుపు దాడులు చేయగలవు.
ఇవి CRN-91 గన్‌లతో పాటు అత్యాధునిక నిఘా పరికరాలను కలిగి ఉంటాయి.

హిందూ మహాసముద్రంలో చైనా నిఘా నౌకల సంచారం పెరగడంతో ఇండియాకి ఇలాంటి నేవీ బేస్ అవసరం. బంగ్లాదేశ్‌లో ఇటీవల రాజకీయ మార్పులు, పాకిస్థాన్‌తో పెరుగుతున్న సాన్నిహిత్యం దృష్ట్యా సముద్ర మార్గం ద్వారా ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు. సముద్ర సరిహద్దుల గుండా అక్రమంగా భారత్‌లోకి వచ్చే చొరబాట్లను నియంత్రించడం. ఈ స్థావరంలో సుమారు 100 మంది నౌకాదళ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఇది విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ పరిధిలో పనిచేస్తూ, అండమాన్ నికోబార్ కమాండ్‌తో సమన్వయం చేసుకోనుంది.

Advertisment
తాజా కథనాలు