భారత్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ఇండియన్ నేవీ పాక్, చైనాలకు చెక్

సరిహద్దుల్లో చైనా పెరుగుతున్న ప్రభావం, మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత చర్యలను దృష్టిలో ఉంచుకుని, నేవీ తన దృఢమైన వైఖరిని ప్రపంచానికి చాటి చెప్పింది. ముఖ్యంగా 'ఆపరేషన్ సిందూర్' ప్రస్తావన పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికగా నిలిచింది.

New Update
Navy Vice Admiral Sanjay Vatsayan

హిందూ మహాసముద్ర ప్రాంతంలో పెరుగుతున్న విదేశీ నౌకల కదలికల నేపథ్యంలో ఇండియన్ నేవీ తన 'ఆపరేషన్ సింధూర్' ప్రణాళికలో భాగంగా చైనా, పాకిస్తాన్‌లకు గట్టి సందేశాన్ని పంపింది. 'ఒక బాణం, రెండు గురి' అనే వ్యూహంలో భాగంగా, ఈ ప్రాంతంలో ప్రతి విదేశీ నౌకపై నిఘా ఉంచుతున్నామని నేవీ వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సాయన్ స్పష్టం చేశారు.

చైనాకు పరోక్ష హెచ్చరిక

వైస్ అడ్మిరల్ వత్సాయన్ మాట్లాడుతూ, హిందూ మహాసముద్రంలో ఇతర ప్రాంతీయ శక్తుల ఉనికి నిరంతరంగా పెరుగుతోందని, ముఖ్యంగా చైనా నౌకల కదలికలను తాము నిశితంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. భారత నౌకాదళం ప్రస్తుతం దాదాపు 40 యుద్ధ నౌకలను మోహరించిందని, ఈ సంఖ్యను త్వరలో 50కి పైగా పెంచే ప్రక్రియలో ఉందని తెలిపారు. చైనా నౌకలు ఏంచేస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్తున్నాయో తమకు తెలుసని ఆయన చేసిన వ్యాఖ్యలు బీజింగ్‌కు పరోక్ష హెచ్చరికగా భావించవచ్చు.

పాకిస్తాన్‌కు 'ఆపరేషన్ సింధూర్' ప్రస్తావన

పాకిస్తాన్‌కు నేరుగా వార్నింగ్ ఇస్తూ, నౌకాదళం 'ఆపరేషన్ సింధూర్' ఇప్పటికీ కొనసాగుతోందని వైస్ అడ్మిరల్ వత్సాయన్ ప్రకటించారు. ఏదైనా ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవడానికి తాము పూర్తిగా సిద్ధంగా, మోహరించబడి ఉన్నామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ అనేది అంతకుముందు జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన సైనిక చర్య. దీనిని ప్రస్తావించడం ద్వారా, భవిష్యత్తులో పాకిస్తాన్ ఏ రకమైన దుస్సాహసానికి పాల్పడినా తీవ్రంగా స్పందించడానికి నౌకాదళం సిద్ధంగా ఉందనే బలమైన సంకేతాన్ని ఇచ్చింది.

Advertisment
తాజా కథనాలు