ఇండియా VS ఆస్ట్రేలియా.. విజయానికి చేరువలో భారత్
ఆస్ట్రేలియా -భారత్ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ప్రారంభమైంది.టీమిండియా ఆసిస్‌కు మూడోరోజు 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 227 పరుగుల వద్ద ఆసీస్ 9వ వికెట్‌ను కోల్పోయింది. దీంతో టీమిండియా విజయానికి చేరువలో ఉంది.
బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వొద్దు.. పాంటింగ్ సంచలన కామెంట్స్!
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మొదటి టెస్టుకు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించబోతున్నట్లు వస్తున్న వార్తలపై రికీ పాంటింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. భారత బౌలింగ్ విభాగానికి పెద్ద దిక్కుగా ఉన్న బుమ్రాకు కెప్టెన్సీ కష్టమైన పని అన్నాడు. ఒత్తిడికి గురిచేయొద్దన్నాడు.
IND Vs AUS: 33 ఏళ్ల తర్వాత.. ఆసీస్-భారత్ మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్!
దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆసీస్-భారత్ మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం రంగం సిద్ధమైంది. 2023-25 (WTC) సీజన్లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ ఆస్ట్రేలియా వేదికగా నవంబర్ 22 నుంచి జనవరి 07 వరకూ జరగనుంది.
T20World Cup: ఫైనల్లో భారత్ vs ఆస్ట్రేలియా పోటీ పడితే ఆసక్తికరంగా ఉంటుంది.. ట్రావిస్ హెడ్
టీ20 వరల్డ్ కప్ టోర్ని ప్రారంభమైంది.ఇప్పటికే ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా గెలిచింది.అయితే తాజాగా ఆస్ట్రేలియా డేంజరస్ బ్యాట్స్ మెన్ ట్రావిస్ హెడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియాతో,ఆస్ట్రేలియా తలపడితే బాగుటుందని హెడ్ అన్నాడు.
IND vs AUS: ఏడు నెలల్లో మూడుసార్లు.. కంగారూల దెబ్బకు టీమిండియా అభిమానులకు కన్నీళ్లు!
గత 7 నెలల్లో ముగిసిన మూడు ఐసీసీ మేజర్ ఈవెంట్లలో భారత్ ప్రతీసారి ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఓడిపోయింది. WTC ఫైనల్, వన్డే ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు తాజాగా జరిగిన అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లోనూ భారత్ ఆస్ట్రేలియాపై ఓడిపోయింది.
IND vs AUS : అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ ఉత్కంఠగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక టైటిల్‌ను ముద్దాడేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
IND VS AUS: చరిత్ర సృష్టించిన అమ్మాయిలు.. కంగారూలపై తొలిసారి టెస్టు విక్టరీ!
వాంఖడే స్టేడియంలో భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఏకైక టెస్టులో విమెన్స్ టీమ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్టు ఫార్మాట్లో కంగారూలపై భారత మహిళా జట్టుకు ఇదే తొలి విజయం.
WC Pitch: నాసిరకం పిచ్‌లు.. పరువు తీసిన బీసీసీఐ.. ఐసీసీ షాకింగ్ రిపోర్ట్!
వరల్డ్‌కప్‌లో ఇండియా ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఐదు మ్యాచ్‌లు 'యావరేజ్' పిచ్‌పైనే ఆడినట్టు ఐసీసీ రిపోర్ట్ చెబుతోంది. ఇందులో అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది. అక్టోబర్ 14న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కూడా 'యావరేజ్' పిచ్‌పైనే జరిగింది.