IND Vs AUS: 33 ఏళ్ల తర్వాత.. ఆసీస్-భారత్ మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్! దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆసీస్-భారత్ మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కోసం రంగం సిద్ధమైంది. 2023-25 (WTC) సీజన్‌లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ ఆస్ట్రేలియా వేదికగా నవంబర్ 22 నుంచి జనవరి 07 వరకూ జరగనుంది. By srinivas 05 Jul 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Border–Gavaskar Trophy: ఇటీవలే టీ20 వరల్డ్ కప్ గెలిచి సంబరాల్లో మునిగితేలుతున్న భారత్ మరో వలర్డ్ కప్ ను ఒడిసిపట్టేందుకు రంగం సిద్ధమైంది. రెండుసార్లు అందినట్లే అంది మిస్ అయిపోయిన టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా ఆస్ట్రేలియాలతో ప్రతిష్టాత్మక సిరీస్ ఆడనుంది. ఈ మేరకు 2023-25 (WTC) సీజన్‌లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య దాదాపు 33 ఏళ్ల తర్వాత బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. అయితే ఈ బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం ఆస్ట్రేలియా వచ్చేందుకు భారత (Team India) అభిమానులు ఆసక్తి చూపిస్తారని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్ జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాం. అందులో భాగంగా ఫ్యాన్ జోన్‌లను ఏర్పాటు చేస్తున్నాం. మ్యాచ్‌లను ఆస్వాదించడంతోపాటు సంబరాలు చేసుకునే వీలుగా ఈ వేదికలు ఉంటాయని క్రికెట్ ఆస్ట్రేలియా జనరల్ మేనేజర్ జోయల్ మోరిసన్ తెలిపారు. షెడ్యూల్: తొలి టెస్టు: నవంబర్ 22-26 (పెర్త్) రెండో టెస్టు: డిసెంబర్ 06-10 (అడిలైడ్) మూడో టెస్టు: డిసెంబర్ 14-18 (బ్రిస్బేన్) నాలుగో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు): డిసెంబర్ 26-30 (మెల్‌బోర్న్) ఐదో టెస్టు: జనవరి 03-07 (సిడ్నీ) గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఓడిన టీమ్ఇండియా రివేంజ్ తీసుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దృష్టి ఇకపై టెస్టులపైనే పెట్టనున్నారు. డబ్ల్యూటీసీ టైటిల్‌ను కూడా ఖాతాలో వేసుకోవాలని రోహిత్ ఉవ్విల్లూరుతున్నాడు. #border-gavaskar-trophy #india-vs-australia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి