INDIA vs AUSTRALIA U-19 WC Final: గతేడాది(2023) జూన్‌లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియాపై ఓవల్ వేదికగా జరిగిన ఫైనల్లో కంగుతిన్నది టీమిండియా. ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌లోనూ ఇండియా ఫైనల్‌కు వచ్చింది. అక్కడ కూడా ఫైనల్లో ఆస్ట్రేలియానే. అయితే వన్డే ప్రపంచకఫ్లోనూ అదే రిజల్ట్. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇండియాపై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆరోసారి వరల్డ్‌కప్‌ను ఆరేసింది. మూడోసారి వరల్డ్‌కప్ సాధించాలన్న టీమిండియా కల చెదిరిపోయింది. అభిమానుల గుండె పగిలింది. ఇక్కడితో ఈ స్టోరీ ఆగలేదు. తాజాగా అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లోనూ సేమ్ సీన్ రిపీట్.
పూర్తిగా చదవండి..IND vs AUS: ఏడు నెలల్లో మూడుసార్లు.. కంగారూల దెబ్బకు టీమిండియా అభిమానులకు కన్నీళ్లు!
గత 7 నెలల్లో ముగిసిన మూడు ఐసీసీ మేజర్ ఈవెంట్లలో భారత్ ప్రతీసారి ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఓడిపోయింది. WTC ఫైనల్, వన్డే ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు తాజాగా జరిగిన అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లోనూ భారత్ ఆస్ట్రేలియాపై ఓడిపోయింది.
Translate this News: