/rtv/media/media_files/2025/10/23/2nd-one-day-2025-10-23-06-35-50.jpg)
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆదివారం పెర్త్‌లో జరిగిన మొదటి వన్డేలో భారత జట్టు దారుణంగా ఓడిపోయింది. ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీని కారణంగా మూడు వన్డేల సీరీస్‌లో టీమ్ ఇండియా 1-0తో వెనుకబడిపోయింది. ఈరోజు రెండో వన్డే ఆిలైడ్‌లో మరికాసేపట్లో మొదలవబోతోంది. టీమ్ ఇండియాకు ఇది డిసైడింగ్ మ్యాచ్. ఇందులో గెలిస్తే ఒకటి-ఒకటితో ఆస్ట్రేలియాతో సమానంగా నిలుస్తుంది. ఓడితే సీరీస్‌ను ఆస్టేలియా చేతిలో పెట్టేసి వెళ్ళిపోవడమే. అందుకే టీమ్ ఇండియాకు రెండో వన్డే తప్పక గెలవాల్సిన పరిస్థితి.
ఆడిలైడ్‌లో రికార్డ్..
ఆడిలైడ్‌లో టీమ్ ఇండియాకు మంచి రికార్డే ఉంది. ఇక్కడ భారత జట్టు ఎక్కువ మ్యాచ్‌లనే గెలిచింది. మొత్తం ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడితే అందులో తొమ్మిదింట్లో విజయం సాధించింది. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏంటంఏ..2008 నుంచి భారత జట్టు ఆడిలైడ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దీంతో ఈరోజు జరగే మ్యాచ్‌లో మన జట్టు గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. సీరీస్‌ను నిలబెట్టుకోవడంతో పాటూ ఆడిలైడ్ రికార్డ్‌ను కూడా నిలపుకోవాలని భావిస్తున్నారు.
ఈరోజు జరిగే మ్యాచ్‌లో కూడా దాదాపుగా మొదటి వన్డేకు ఆడిన జట్టునే ఉంచవచ్చును. అయితే పెర్త్‌లో బ్యాటింగ్ లైనప్ పూర్తిగా విఫలం అయింది. సీనియర్లు రో-కో లు కూడా తీవ్ర నిరాశపరిచారు. రోహిత్ 14 బంతుల్లో 8 పరుగులు చేస్తే...కోహ్లీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. కనీసం ఈ రోజు మ్యాచ్ లో అయినా వీళ్ళిద్దరూ ఆడతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగుతున్న నేపథ్యంలో రో-కోలకు ప్రస్తుత సీరీస్ పెద్ద ఛాలెంజింగ్‌గా మారింది. ఈరోజు మ్యాచ్‌లో వీళ్ళిద్దరూ రాణించడం చాలా అవసరం.
రాణించాల్సిన బ్యాటర్లు..
పెర్త్‌లో వర్షం భారత్‌కు చాలా ఆటంకం కలిగించింది. నాలుగు సార్లు ఆట నిలిపేయడంతో బ్యాటర్లు, బైలర్లు కూడా చాలా కష్టపడ్డారు. కానీ ఆడలైడలో ఆ బాధ లేదు. పైగా ఇక్కడ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించేదిగా ఉంటుంది. దీన్ని భారత బ్యాటర్లు యూజ్ చేసుకోవాలి. ఆసీస్ పేస్ భారత బ్యాటర్లను ఇబ్బందులు పెడుతోంది. దీన్ని మనవాళ్ళు అధిగమించాలి. హేజిల్ వుడ్, స్టార్క్‌లను గట్టిగా తిప్పికొట్టాలి. కోహ్లి, రోహిత్‌తో పాటు గిల్, శ్రేయస్ పరుగుల బాట పట్టాల్సివుంది. గత మ్యాచ్‌లో రాణించిన రాహుల్ ఈసారి ఇంకా పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి. ఈ సారి టీమ్‌లోకి వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్‌దీప్, హర్షిత్ రాణా స్థానంలో ప్రసిద్ధ్‌లను తీసుకునే తీసుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే మొదటి వన్డే గెలిచిన ఉత్సాహంలో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ కమిన్స్ దూరమైనా జట్టు స్ట్రాంగ్‌గా ఉండి భారత్‌ను బెంబేలెత్తిస్తోంది. హేజిల్‌వుడ్, స్టార్క్ ఆసీస్‌కు ప్రధాన అస్త్రాలు. ఈ మ్యాచ్‌కు ఆసీస్.. ఫిలిప్ స్థానంలో అలెక్స్ కేరీ, కునెమన్ స్థానంలో ఆడమ్ జంపాలను తుది జట్టులో ఆడించే అవకాశముంది.