ఇండియా VS ఆస్ట్రేలియా.. విజయానికి చేరువలో భారత్‌

ఆస్ట్రేలియా -భారత్‌ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ప్రారంభమైంది.టీమిండియా ఆసిస్‌కు మూడోరోజు 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 227 పరుగుల వద్ద ఆసీస్‌ 9వ వికెట్‌ను కోల్పోయింది. దీంతో టీమిండియా విజయానికి చేరువలో ఉంది.

New Update
cricket test

ఆస్ట్రేలియా -భారత్‌ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ప్రారంభమైంది. టీమిండియా ఆసిస్‌కు మూడోరోజు 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 150 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆసీస్‌ 104 రన్స్‌కు కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 487/6 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. మొత్తంగా భారత్‌ 533 పరుగులు కాగా లక్ష్యం 534 పరుగులు. విరాట్ కోహ్లీ సెంచరీ సాధించిన వెంటనే ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేయాలని భారత డ్రెస్సింగ్‌ రూమ్ నిర్ణయించింది. ప్రస్తుతం భారత్‌ విజయానికి అతి దగ్గర్లో ఉంది. 227 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 9వ వికెట్‌ కోల్పోయింది. మరో వికెట్‌ తీస్తే భారత్‌కు విజయం ఖాయం కానుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు