HYD: బంజారాహిల్స్ లో అదుపు తప్పిన కారు..ఒకరు మృతి
బంజారాహిల్స్ లో నిన్న ఒక కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. యాక్సిడెంట్ ఎవరు చేశారన్నది ఇంకా తెలియలేదు.
బంజారాహిల్స్ లో నిన్న ఒక కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. యాక్సిడెంట్ ఎవరు చేశారన్నది ఇంకా తెలియలేదు.
హైదరాబాద్‌లో సంచలనం రేపుతున్న కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈమేరకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
దావోస్ పర్యటనలో విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి కానీ, ప్రభుత్వం సొంతరాష్ట్రం వారికే కాంట్రాక్టులు కట్టబెడుతుందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధిస్తోందని అందుకే వ్యాపారవేత్తలు ఇతర రాష్ట్రాలకి వెళ్తున్నారని ఆయన ఆరోపించారు.
తన భార్యను చంపేముందు ప్రాక్టీస్ కోసం కుక్కను నరికి చంపినట్లుగా వస్తోన్న వార్తలపై గురుమూర్తి స్పందించాడు. తానెప్పుడూ కుక్కను పెంచుకొలేదని, కుక్కను తానెందుకు చంపుతానని వివరించాడు. భార్యను చంపేముందు కుక్కను చంపి ట్రైల్ చేశాడనేది పూర్తిగా అవాస్తవమన్నాడు.
హైదరాబాద్ నగరాన్ని పొగ మంచు కమ్మేసింది. రోడ్లు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగ మంచు వల్ల రోడ్లపై వాహనాలు మెల్లిగా కదులుతున్నాయి. ఇలాంటి సమయాల్లో కూడళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఓ దొంగల ముఠా రోడ్డు రోలర్‌నే కొట్టేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న రోడ్డు రోలర్‌ను రాత్రికి రాత్రికే మాయం చేశారు. 2 భారీ క్రేన్లతో డీసీఎంలోకి ఎక్కించి మహారాష్ట్రలో స్క్రాప్‌కు అమ్మేందుకు స్కెచ్ వేశారు.
మీర్పేట్లో భార్యను ముక్కలుగా చేసిన ఘటనలో మరో సంచలన విషయం బయటపడింది. గురుమూర్తి సెల్‌ఫోన్‌ను మరో మహిళ ఫొటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మహిళతో సంబంధం వల్లే భార్య అడ్డు తొలగిచేందుకు ఈ పనికి పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు.