Hyderabad: హైదరాబాద్ పెను విషాదం.. కూలిన హోటల్ గోడ.. ముగ్గురు స్పాట్ డెడ్!

హైదరాబాద్ లో ఘోర విషాదం చేటుచేసుకుంది. ఎల్బీనగర్ లోని ఓ హోటల్ గోడ కుప్పకూలి ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని కామినేని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

New Update
 Gujarat Accident

siddipet crime

Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఘోర విషాదం చేసుకుంది. కార్మికులు సెల్లార్ కోసం  గుంతలు తవ్వుతుండగా.. అదే స్థలానికి చెందిన ప్రహరీ గోడ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.  శిథిలాల కింద నలుగురు చిక్కుకోగా.. అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని కామినేని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. దశరథ  అనే మరో వ్యక్తికి కాలు విరిగింది. మృతులను వీరయ్య, వాసు, రాముగా గుర్తించారు. వీరంతా ఖమ్మం జిల్లా సీతారామాపురం గ్రామానికి చెందిన వారు. రోజూ కూలీలుగా ఇక్కడ పనిచేస్తున్నారు. తమవారి  మరణంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

ఇటీవలే సిద్ధిపేటలో.. 

ఇది ఇలా ఉంటే.. ఇటీవలే  సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవ‌ర్ధ‌న‌గిరి గ్రామంలో  ఉపాధి హామీ పనుల్లో భాగంగా గ్రామా శివారులో మట్టి తవ్వటానికి వెళ్లిన కూలీలు మట్టి దిబ్బలు కూలు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన  తల్లి సరోజ, కూతురు మమత బండరాళ్ల కిందపడి అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న రెవెన్యూ శాఖా అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ స‌హాయంతో శిథిలాల‌ను తొల‌గించి, మృత‌దేహాల‌ను బయటకు తీశారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసపత్రికి తరలించారు. 

Advertisment
తాజా కథనాలు