Prabhakar: 'సరిపోదా గురువారం'.. నాని సినిమా ఆదర్శంగా క్రిమినల్ ప్రభాకర్ ఆగడాలు!

బత్తుల ప్రభాకర్‌ కేసులో సంచలనాలు బయటపడ్డాయి. ‘సరిపోదా శనివారం’ సినిమా ఆదర్శంగా ఇతను నేరాలకు పాల్పడ్డాడు. గురువారం మాత్రమే చోరీలు చేస్తాడు. ‘ధూమ్‌’ సినిమా స్టైల్లో ఇంట్లో ప్లానింగ్ సెటప్ ఉంది. 40 మంది అమ్మాయిలను అనుభవించాడని పోలీసులు తెలిపారు. 

author-image
By srinivas
New Update
prabhakar

Bhattula Prabhakar crime

Prabhakar: హైదరాబాద్‌ గచ్చిబౌలి ప్రిజమ్‌ పబ్‌ వద్ద కాల్పులు జరిపి పోలీసులకు చిక్కిన క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ కేసులో మరిన్ని సంచలనాలు బయటపడుతున్నాయి. నాని నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమాను ఆదర్శంగా తీసుకుని ప్రభాకర్ నేరాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. విద్యాసంస్థలే లక్ష్యంగా దొంగతనాలు చేసిన ప్రభాకర్.. వారంలో ఒక్కరోజు గురువారం మాత్రమే నేరాలు చేస్తాడట. సోమ, మంగళ, బుధ మూడు రోజులు ప్లాన్ చేసుకుని గురువారం యాక్షన్‌లోకి దిగుతాడట. ఇక శుక్ర, శని, ఆదివారాల్లో జల్సాలు చేస్తాడట. పార్కులు, పబ్‌ల చుట్టూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నట్లు విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.  

గచ్చిబౌలిలో రూ.50వేల అద్దె ఇళ్లు.. 

శరీరంపై 3, 100 నెంబర్లను పచ్చబొట్టు వేయించుకున్న ప్రభాకర్.. 3 అంటే రూ.335 కోట్లు కొల్లగొట్టడమని వెల్లడించాడు. ఇక 100 అంటే వంద మంది అమ్మాయిలతో శృంగారలో పాల్గొనాలనేది తన డ్రీమ్ గా చెప్పాడు. గచ్చిబౌలిలో నెలకు రూ.50వేలు అద్దె చెల్లిస్తూ ఓ ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌లో ఉంటున్న ప్రభాకర్‌.. ‘ధూమ్‌’ సినిమా రేంజ్ లో తన గదిలో పెద్ద సెటప్‌ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. గోడకు తన టార్గెట్స్ నెరవేర్చుకునే మార్గాల మ్యాప్‌లను గీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతను కేవలం నగదు మాత్రమే దొంగిలిస్తాడని, కనీసం రూ.10 లక్షలు దొరికే అవకాశం ఉంటేనే యాక్షన్ లోకి దిగుతాడని చెప్పారు. మొత్తం తన లైఫ్ లో రూ.335 కోట్లు సంపాదించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాడని పోలీసులు వెల్లడించారు. 

80 కళాశాలల్లో దొంగతనాలు..

ఇప్పటి వరకు ప్రభాకర్ 80 కళాశాలల్లో దొంగతనాలకు పాల్పడ్డట్లు అంగీకరించాడు. నెక్ట్స్ టార్గెట్ కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రులని తెలిపాడు. హైదరాబాద్‌లోని 2 కార్పొరేట్‌ హాస్పిటల్లపై యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నాడు. సెల్‌ఫోన్‌ వాడతాడు కానీ అందులో సిమ్‌ కార్డు ఉండదు. రెక్కీకి వెళ్లినప్పుడు ఫొటోలు తీసేందుకే ఫోన్‌ వాడతాడు. చీకటి గదుల్లో సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌ను ఉపయోగిస్తాడు. వంట చేసి పెట్టేందుకు ఓ వంట మనిషిని కూడా పెట్టుకున్న దొంగోడు కొత్తవాళ్లను ఎవరినీ తన ఫ్లాట్‌లోకి రానివ్వడట. ఊళ్లో తనకు చేపలు, రొయ్యల వ్యాపారులున్నాయని చెబుతూ ఖరీదైన దుస్తులు, మద్యం తాగుతుంటాడు. స్నేహితుడి పేరుపై కొన్న స్కోడా కారులో తిరిగేవాడని చెప్పారు.

ఇది కూడా చదవండి: Cummins: కోహ్లీ ఇజ్జత్ తీసిన ఆసీస్ కెప్టెన్.. ఛాంపియన్ ట్రోఫీ నుంచి ఔట్!

40 మంది అమ్మాయిలతో..

మనీ ట్రాన్సాక్షన్ కోసం ఫ్రెండ్స్ బ్యాంకు అకౌంట్స్ వాడుకునేవాడు. బిహార్‌ నుంచి తుపాకులు తెచ్చుకున్నాడు. ఓఆర్ఆర్ అటవీ ప్రాంతాల్లో తుపాకీ పేల్చడం సొంతంగా నేర్చుకున్నాడు. కేవల 9వ తరగతి చదివిన ప్రభాకర్‌ తెలివి చూస్తే తమకే ఆశ్చర్యమేస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఇక భారీ డబ్బు ఆశచూపి నచ్చిన అమ్మాయిని ఫ్లాట్‌కు తీసుకెళ్లి కోరిక తీర్చుకుంటాడు. ఇప్పటికే 40 మందిని ట్రాప్‌ చేశాడు. ఏపీకి చెందిన ఓ అమ్మాయి వారానికి ఒకరోజు అతని రూమ్ కు వచ్చి రూ.30వేలు తీసుకెళ్లేదని పోలీసులు తెలిపారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు