BIG BREAKING: హైదరాబాద్ లో ఈరోజు భారీ వర్షం.. ఐటీ ఉద్యోగులకు ఎర్లీ లాగౌట్, WFH !
ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల నుంచే లాగౌట్ కావాలని సూచించారు.
ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల నుంచే లాగౌట్ కావాలని సూచించారు.
గడచిన వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణతో పాటు ఏపీలోనూ మరో ఏడు రోఎజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
హైదరాబాద్ లో మరో 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించింది. అలాగే రోడ్లపై నడిచేటప్పుడు, ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ పేర్కొంది.
రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు ఉన్నాయి. గురువారం హైదరాబాద్‌తోపాటు దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం పరిస్థితి దారుణంగా తయారైంది.
హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ వరద నీటితో జలమయమైపోయాయి. ఎక్కడ చూసిన అంతా వరద నీరే! దీంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపైకి వరద నీరు భారీగా రావడంతో కొన్ని చోట్ల వాహనాలు మునిగిపోతున్నాయి.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ముంపు ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు.