BIG BREAKING: హైదరాబాద్ లో ఈరోజు భారీ వర్షం.. ఐటీ ఉద్యోగులకు ఎర్లీ లాగౌట్, WFH !

ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్ష సూచన  నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక  సూచనలు జారీ చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల నుంచే లాగౌట్ కావాలని సూచించారు.

New Update
rains

HYD Rain Alert:  గత వారం రోజులుగా హైరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. సాయంత్రం కాగానే వరుణ దేవుడు విజృంభిస్తున్నాడు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు భారీ వర్షాల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వరద నీటితో సిటీలోని  డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి! రోడ్లన్నీ జలమయమైపోయి.. చిన్నపాటి కాలువలుగా దర్శనమిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ ఏర్పడి.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆఫీసుల నుంచి ఇంటికెళ్లి ఉద్యోగులు గంటలకొద్ది రోడ్లపైనే ఉండిపోతున్నారు. 10 నిమిషాల్లో వెళ్లే దూరం.. ట్రాఫిక్ కారణంగా అరగంటైనా పడుతుంది. ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజల పరిస్థితి మరింత దీనంగా మారింది. వరద నీరంతా ఇళ్లల్లోకి చేరు నానా అవస్థలు పడుతున్నారు.  ఈ నేపథ్యంలో  హైడ్రా,  జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 

ఈరోజు కూడా భారీ వర్షం!

అయితే ఈరోజు కూడా హైదరాబాద్ కి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు కీలక సూచనలు జారీ చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటల నుంచే లాగౌట్ అవ్వాలని సూచించారు. అలాగే నైట్ షిఫ్ట్స్ కి వెళ్ళేవాళ్ళు ఇంటి నుంచే పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని, ఉద్యోగులు సురక్షితంగా ఇళ్లకు చేరే వీలు ఉంటుందని తెలిపారు. అలాగే అత్యవసర వాహనాలు సులువుగా వెళ్లేందుకు వీలవుతుందని పోలీసులు వెల్లడించారు.

బంగాళాఖాతంలో ని అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు మొస్తారు నుంచి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది. రంగారెడ్డి, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, ములుగు, నల్గొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఏపీలోనూ భారీ వర్షాలు.. 

తెలంగాణతో పాటు ఏపీలోని పలు జిల్లాలకు కూడా ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు, ఒంగోలు, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు