Hyderabad rains: దారుణంగా మారిన హైదరాబాద్ పరిస్థితి.. ఇంకా 2రోజులుంది (VIDEOS)

రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు ఉన్నాయి. గురువారం హైదరాబాద్‌తోపాటు దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం పరిస్థితి దారుణంగా తయారైంది.

New Update
Hyderabad heavy rains

Hyderabad heavy rains

రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు ఉన్నాయి. గురువారం హైదరాబాద్‌తోపాటు దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం పరిస్థితి దారుణంగా తయారైంది. ఎక్కడ చూసినా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నగర్‌లో వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయాడు. లోతట్టు ప్రాంతాల్లో 200 ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌లో పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తడిసి ముద్దైన చార్మినార్

భారీ ట్రాఫిక్‌లో హైదరాబాద్ రోడ్లు

నీట మునిగిన వాహనాలు

దాదాపు 500 బైకులు పూర్తిగా నీట మునిగాయి. అత్యధికంగా గచ్చిబౌలిలో 14 సెంటిమీటర్ల వాన కురిసింది. సరూర్‌నగర్‌లో 13  సెం.మీల వర్షం నమోదైంది. హైదరాబాద్ వ్యాప్తంగా 12.5 సెంటి మీటర్ల వర్షాపాతం కురిసింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద పోటెత్తింది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ రోజు(శుక్రవారం) కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం వరకూ హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు