BIG BREAKING: హైదరాబాద్ లో మరో 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగనుంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. అలాగే రోడ్లపై నడిచేటప్పుడు, ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు ఉన్నందున ప్రజలు చెట్ల కింద, పాడుబడిన నిర్మాణాల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
నిన్న కుండపోత వర్షం
నిన్న సాయంత్రం కురిసిన కుండపోత వర్షంతో హైదరాబాద్ అంతా ఆగమైపోయింది. భారీ వరద నీటితో పలు ప్రాంతాల్లో నీట మునిగాయి. గచ్చిబౌలి,మాదాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ఖైరతాబాద్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్ నగర్‌లో ఏరియాల్లో రోడ్లన్నీ జలమయమైయ్యాయి. అమీర్ పేట్, యూసఫ్ గూడ ప్రాంతాల్లో భుజాల లోతులో వరద నీరు వచ్చి చేరాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లిలో 13.7 సెంటీ మీటర్లు.. సరూర్ నగర్లో 12.5 సెంటీ మీటర్లతో అత్యధిక వర్షపాతం నమోదైంది. కేవలం గంట వ్యవధిలోనే కుంభవృష్టి వానతో హైదరాబాద్ రోడ్లన్నీ కాలువల్లా దర్శనమిచ్చాయి. నాళాలు, డ్రైనేజీలు రోడ్లపై పొంగిపొర్లాయి.
Heavy rains on August 7, 2025, triggered flash floods in Hyderabad, with areas like Khajaguda receiving up to 134 millimeters of rainfall in one to two hours. #HyderabadRains#FlashFloods#Khajaguda#HyderabadWeather#RainAlert#UrbanFlooding#August2025Rains#IndiaWeatherpic.twitter.com/JI6mgVy1Er
— Global Updates 🌍 (@GlobalUpdates7) August 8, 2025
రోడ్లపై వరద నీటి భీభత్సముతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్తున్న వారు గంటల కొద్ది రోడ్లపైనే నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోకాళ్ళ లోతు నీటితో అవస్థలు పడ్డారు. కొన్ని చోట్ల రాత్రంతా విద్యుత్ సరఫరా కూడా ఆగిపోయింది.
కృష్ణ నగర్ లో వరద నీటి భీభత్సానికి ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. అంతేకాదు 200కి పైగా ఇళ్లలోకి వరద నీరు చేరాయి. అమీర్ పేట్, యూసఫ్ గూడ వంటి ప్రాంతాల్లో పార్క్ చేసి ఉంచిన వరద నీటికి కొట్టుకుపోయాయి. దీంతో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: Hyderabad rains: దారుణంగా మారిన హైదరాబాద్ పరిస్థితి.. ఇంకా 2రోజులుంది (VIDEOS)