Heavy Rains : తెలంగాణకు బిగ్ అలర్ట్‌.. మరో ఏడు రోజులు కుండపోత

గడచిన వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణతో పాటు ఏపీలోనూ మరో ఏడు రోఎజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

New Update
rains

rains Photograph: (rains)

Heavy Rains : గడచిన వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కుంభవృష్టి కురుస్తోంది. ఉదయమంతా ఉక్కపోతగా ఉండి సాయంత్రం కాగానే ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో  భారత వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణతో పాటు ఏపీలోనూ ఈ రోజు నుంచి ఈ నెల15 వరకూ రాష్ట్రవ్యాప్తంగా  భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 7 రోజుల్లో రెండు రాష్ట్రాల వ్యాప్తంగా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. మరో ఏడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇది కూడా చూడండి:KTR vs Bandi Sanjay :  బండి సంజయ్‌కి 48 గంటల డెడ్‌లైన్‌.. సారీ చెప్పకపోతే అంతే...కేటీఆర్ వార్నింగ్

 మంచిర్యాల, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 10, 11 తేదీల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 12, 13, 15 తేదీల్లో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఆయా జిల్లాలల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇది కూడా చూడండి:Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల,భూపాలపల్లి..ములుగు, భద్రాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.వరంగల్, యాదాద్రి, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇక రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌ లోను భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల మూలంగా హుస్సేన్ సాగర్‌‌కు భారీగా వరద వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాగర్‌ నాలా సమీపంలోని కాలనీల వాసులు అలర్ట్ గా ఉండాలని కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. పోలీసులతో పాటు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, హైడ్రా వివిధ విభాగాల అధికారులతో సహా.. కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ.. ప్రజల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

ఇక ఏపీలోని  పల్నాడు, ప్రకాశం, కర్నూలు..కాకినాడ, అనకాపల్లి,ఏలూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని, ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.

Also Read: ముసలోడే కానీ మహానుబావుడు.. నలుగురు అమ్మాయిలతో 21 నెలలు 734 సార్లు!!

Advertisment
తాజా కథనాలు