Rain Alert: తెలంగాణలో వర్ష బీభత్సం.. ఆ 9 జిల్లాలకు రెడ్ అలర్ట్, స్కూల్స్ కి  సెలవులు!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు  భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరం శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

New Update
Rain Alert

Rain Alert

Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి! ఇళ్లలోకి వరద నీరు చేరి జనాలు అవస్థలు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ఆఫీసులకు వెళ్లేవారు, పనులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇక హైదరాబాద్ లో రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి. పలు ఏరియాల్లో మోకాళ్ళ లోతులో నీరు వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సూచించాయి. 

ఆ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు  భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరం శాఖ వెల్లడించింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు హెచ్చరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.  సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 

స్కూల్స్ కి సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని రెడ్ అలెర్ట్ ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు.  హైదరాబాద్ పరిధిలోని స్కూల్స్ కి  హాఫ్ డే సెలవు ఇచ్చారు. ఐటీ కంపెనీల ఉద్యోగులకు ఇప్పటికే  "వర్క్ ఫ్రమ్ హోం" ఇవ్వాలని కూడా సూచించారు.

Also Read: 50 Years Of Rajinikanth: సినీ తారల నుంచి సీఎం వరకు.. సూపర్ స్టార్ కి సూపర్ విషెస్!

Advertisment
తాజా కథనాలు