Heavy Rain: హైదరాబాద్‌లో మరికాసేపట్లో భారీ వర్షం.. ఎవరు బయటకు రావొద్దు..IMD హెచ్చరిక

తెలంగాణను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్‌కు మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాబోయే రెండు గంటల్లో హైదరాబాద్‌లో మోస్తరు నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

New Update
Rain

Rain

తెలంగాణను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(hyderabad rains today) ముంచెత్తుతున్నాయి. తెలంగాణకు మరోసారి అత్యంత భారీ వర్ష(heavy rains across telangana) సూచన చేసింది వాతావరణ శాఖ. రాబోయే రెండు గంటల్లో హైదరాబాద్‌లో మోస్తరు నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.   హైదరాబాద్, సమీప జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణలోని 4 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతుంది. నిర్మల్, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలు డేంజర్‌లో ఉన్నాయి. ఈ 4 జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌ జిల్లాలకు ఐఎండీ అత్యంత భారీ వర్ష సూచన చేసింది. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాకు భారీ వర్ష సూచన చేసింది.

Also Read :  తెలంగాణలో కుండపోత వర్షాలు.. 25 జిల్లాలకు బిగ్ అలర్ట్.. డేంజర్ జోన్‌లో ఈ 11 జిల్లాలు!

Heavy Rain In Hyderabad

హైదరాబాద్‌ నగరాన్ని వర్షాలు వదలడం లేదు. అలాగే  రాబోయే 2 గంటల్లో  మరోసారి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌ లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.  IMD వివరాల ప్రకారం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనేక జిల్లాల్లో ఆరంజ్, ఎల్లో అలర్ట్ లు జారీ చేశారు. అదే సమయంలో నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో, రాత్రి తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా, జగిత్యాల, సిద్దిపేటలో ఈ రాత్రి నుంచి వర్షాలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు, కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, హన్మకొండ, వరంగల్ తదితర జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. అయితే, తేలికపాటి జల్లులు కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తేల్చి చెప్పింది.

Also Read :  కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో పరిస్థితి ఘోరం VIDEO.. ఈరోజు మరో 2 జిల్లాల్లో డేంజర్‌

Advertisment
తాజా కథనాలు