Hyderabad: ఓరెయ్ కామాంధుడా..బెదిరించి అత్యాచారం.. ప్రెగ్నెంట్ చేసి కూడా వదల్లేదు!

తన దగ్గర పని చేసిన ఒక మహిళను బ్లాక్‌మెయిల్ చేసి, ఆమెపై పదేపదే అఘాయిత్యానికి పాల్పడిన ఒక వ్యక్తి ఉదంతం హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో వెలుగు చూసింది.

New Update
women

Hyderabad: తన దగ్గర పని చేసిన ఒక మహిళను బ్లాక్‌మెయిల్ చేసి, ఆమెపై పదేపదే అఘాయిత్యానికి పాల్పడిన ఒక వ్యక్తి ఉదంతం హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో వెలుగు చూసింది. గుంటూరు జిల్లాకు చెందిన ఓ 28 ఏళ్ల మహిళ హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ పరిధిలో నివసిస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. 

సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఆమె బాలానగర్‌లో ఒక సాఫ్ట్‌వేర్(software) సంస్థను నడుపుతున్న బంజారాహిల్స్‌కు చెందిన మల్లికార్జునరెడ్డి (50) వద్ద పనిచేసింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య యజమాని, ఉద్యోగి అనే సంబంధం ఉండేది. కొన్నాళ్ల తర్వాత ఆమె ఆ సంస్థలో పని మానేసి, మరొకరిని వివాహం చేసుకుని తన కుటుంబ జీవితంలో బిజీ అయిపోయింది.

Also Read: ఆరు రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ పూర్తి..ఆ రాష్ట్రంలో ఏకంగా 68 లక్షల ఓటర్ల తొలగింపు

అయితే, 2024లో మల్లికార్జునరెడ్డి మళ్లీ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. పాత పరిచయం కదా అని ఆమె అతడితో మాట్లాడింది. ఈ క్రమంలోనే మల్లికార్జునరెడ్డి ఆమెను నమ్మించి మధురానగర్‌లోని ఒక ఇంటికి రప్పించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడి అసలు స్వరూపం బయటపడింది. నీ పర్సనల్ ఫోటోలు, వీడియోలు నా దగ్గర ఉన్నాయి. 

సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తా

నేను చెప్పినట్లు వినకపోతే వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తా. నీ సంసారం కూలిపోతుంది అంటూ బెదిరింపులకు దిగాడు. ఆమె పరువు పోతుందన్న భయంతో మౌనంగా ఉండిపోయింది. ఆ బలహీనతను ఆసరాగా చేసుకున్న నిందితుడు మధురానగర్, తిరుపతి తదితర ప్రాంతాలకు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. తను గర్భవతినని తెలిసినా, ఆ కీచకుడు తన వేధింపులను ఆపలేదు సదా బెదిరిస్తూనే ఉన్నాడు.

Also Read: తొలి సూపర్-8 మ్యాచ్‌ రద్దు.. కివీస్-పాక్‌కు చెరో పాయింట్

ఇక భరించలేకపోయిన సదరు మహిళ, తన స్నేహితురాలికి తన గోడును వెళ్లబోసుకుంది. ఆమె ధైర్యం చెప్పడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు ఎస్సార్‌నగర్ పోలీసులు(police) రంగంలోకి దిగారు. తొలుత నిందితుడిపై 'జీరో ఎఫ్‌ఐఆర్' నమోదు చేసిన పోలీసులు, ఘటన జరిగిన ప్రాంతం మధురానగర్ పరిధిలోకి రావడంతో ఆ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. ప్రస్తుతం పోలీసులు మల్లికార్జునరెడ్డి కోసం గాలిస్తున్నారు.
 

Advertisment
తాజా కథనాలు