హైదరాబాద్‌లో ఘోరం.. 2 నెలల బాబుని కట్టెల పోయ్యిలో కాల్చి చంపిన కసాయి తల్లి

హైదరాబాద్‌ దుండిగల్ ప్రాంతంలో మంగళవారం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బౌరంపేట్‌లో 2 నెలల పసికందుని కన్నతల్లే కట్టెల పోయ్యిలో వేసి చంపేసింది. బిడ్డ ఏడుపు శబ్ధం బయటకు వినపడకుండా చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కింది ఆ కర్కశము లేని తల్లి.

New Update
WhatsApp Image 2026-02-24 at 4.07.03 PM

మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో అత్యంత అమానవీయమైన ఘటన వెలుగుచూసింది. కేవలం రెండు నెలల పసికందును ఆమె కన్నతల్లే అత్యంత క్రూరంగా పొయ్యిలో వేసి చంపివేసింది. బౌరంపేట్‌లో 2 నెలల పసికందుని కన్నతల్లే కట్టెల పోయ్యిలో వేసి చంపేసింది. బిడ్డ ఏడుపు శబ్ధం బయటకు వినపడకుండా చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కింది ఆ కర్కశము లేని తల్లి.

బీహార్‌కు చెందిన ఒక వలస కూలీల కుటుంబం బౌరంపేటలోని ఒక నిర్మాణ స్థలం (కన్‌స్ట్రక్షన్ సైట్) వద్ద నివసిస్తోంది. నిన్న రాత్రి ఆ దంపతుల రెండు నెలల బాబు విరామం లేకుండా ఏడుస్తూనే ఉన్నాడు. బాబు ఏడుపు ఆపడం లేదన్న కోపంతో ఆ తల్లి రాక్షసిలా మారింది. పసికందు నోట్లో గుడ్డలు కుక్కి, బాబు కాళ్లు చేతులు కట్టేసి రగులుతున్న కట్టెల పొయ్యిలో పడేసింది. ఈ దారుణానికి ఆ పసిపాప అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

తన బిడ్డ ప్రాణాలు కోల్పోవడం చూసి తండ్రి షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. వీరి గొడవను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన ఘోరాన్ని చూసి విస్తుపోయారు. వెంటనే నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కన్నతల్లే కాలయముడిలా మారిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Advertisment
తాజా కథనాలు