Hyderabad : బిర్యానీ లవర్స్ బీ కేర్ ఫుల్..  మందు తాగకపోయినా మీ  లివర్ ఖతం!

హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది వేడివేడి బిర్యానీలు. కానీ, ఇప్పుడు ఇవే నగరవాసుల కాలేయానికి శాపంగా మారుతున్నాయి. సాధారణంగా మద్యం తాగే వారికే లివర్ పాడవుతుందని అందరూ అనుకుంటారు.

New Update
biryani

హైదరాబాద్(hyderabad) అనగానే మనకు గుర్తొచ్చేది వేడివేడి బిర్యానీలు(biryani). కానీ, ఇప్పుడు ఇవే నగరవాసుల కాలేయానికి శాపంగా మారుతున్నాయి. సాధారణంగా మద్యం తాగే వారికే లివర్ పాడవుతుందని అందరూ అనుకుంటారు. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. అసలు మందు ముట్టని వారికి కూడా లివర్ చుట్టూ కొవ్వు పేరుకుపోయి 'ఫ్యాటీ లివర్' సమస్య వేధిస్తోంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) నిర్వహించిన తాజా స్టడీలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

హైదరాబాద్ లాంటి మెట్రో సిటీల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. నగరంలోని సుమారు 40 శాతం మందికి ఫ్యాటీ లివర్(fatty-liver) ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. అంటే మన పక్కన ఉన్న ప్రతి ఐదుగురిలో ఇద్దరికి లివర్‌లో కొవ్వు పేరుకుపోయిందన్నమాట. ఇందులో మగవారికి 50 శాతం, ఆడవారికి 33 శాతం వరకు ఈ ముప్పు ఉంది. ఆఫీసుల్లో గంటల తరబడి కుర్చీలకే అతుక్కుపోయే వారు, శారీరక శ్రమ లేని వారు ఈ 'సైలెంట్ కిల్లర్' బారిన పడుతున్నారు.

Also Read :  మార్చి 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. 20న రాష్ట్ర బడ్జెట్!

సన్నగా ఉన్నాం కదా అనుకుంటే

చాలామంది తాము సన్నగా ఉన్నాం కదా, మాకేం భయం అనుకుంటారు. కానీ, బాడీ మొత్తం సన్నగా ఉండి కేవలం పొట్ట దగ్గర మాత్రమే కొవ్వు ఉన్నా అది ప్రమాదకరమే. దీనిని శాస్త్రవేత్తలు లీన్ ఫ్యాటీ లివర్ అంటున్నారు. మనం తినే తిండిలో బియ్యం, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల బాడీలోని కండరాలు కరిగిపోయి, అవయవాల చుట్టూ ప్రమాదకరమైన కొవ్వు పేరుకుపోతోంది.

ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో 66.4 శాతం మందికి ఈ సమస్య ఉన్నట్లు గుర్తించారు. మన హైదరాబాద్ బిర్యానీలు, జంక్ ఫుడ్, గంటల తరబడి కూర్చునే సిట్టింగ్ జాబులే దీనికి ప్రధాన విలన్లు. ఈ సమస్యను మొదట్లోనే గుర్తించకపోతే అది లివర్ గట్టిపడటం (సిర్రోసిస్), చివరికి లివర్ క్యాన్సర్‌కు కూడా దారితీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త పడితే ఈ ముప్పు నుంచి తప్పించుకోవడం పెద్ద కష్టం కాదని నిపుణులు చెబుతున్నారు.

Also Read :  మృత్యు శకటాలైన కంటైనర్‌, వాటర్‌ ట్యాంక్‌... నలుగురు మృత్యువాత

  • ఆహార మార్పులు: బియ్యం, స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి.
  • వ్యాయామం: వారానికి కనీసం 5 రోజులు, రోజుకు 45 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ లేదా ఎక్సర్‌సైజ్ చేయాలి.
  • చెకప్స్: 35 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా లివర్ ఫంక్షన్ టెస్టులు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం ఉత్తమం. 
Advertisment
తాజా కథనాలు