Hyderabad : హైదరాబాద్‌లో దారుణం... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సూసైడ్!

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. అంబర్‌పేట పరిధిలో నివసించే రామ్ రాజ్ (55), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24) ముగ్గురూ విగతజీవులుగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

New Update
suicide

suicide

అంబర్‌పేట(ambarpet) లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. అంబర్‌పేట పరిధిలో నివసించే రామ్ రాజ్ (55), ఆయన భార్య మాధవి (50), కుమారుడు శశాంక్ (24) ముగ్గురూ విగతజీవులుగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. తండ్రి రామ్ రాజ్, కుమారుడు శశాంక్ ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Also Read :  బిర్యానీ లవర్స్ బీ కేర్ ఫుల్..  మందు తాగకపోయినా మీ  లివర్ ఖతం!

కట్ చేసుకుని, ఆ తర్వాత ఉరి

అయితే, కుమారుడు శశాంక్ తన చేతి మణికట్టును కట్ చేసుకుని, ఆ తర్వాత ఉరివేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మాధవి మృతదేహం బెడ్ పైనే ఉండటంతో ఆమె మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను చంపి వారు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఆమె ముందే విషం తాగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

రామ్ రాజ్ గతంలో రెండు హోటల్స్ నడిపించేవారు. అయితే, ఇటీవల ఆ బిజినెస్ పూర్తిగా నష్టాల్లోకి వెళ్లడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుల బాధ తాళలేక, బతకలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు రాసిన సూసైడ్ లెటర్ దొరికింది. "వ్యాపారంలో లాస్ అవ్వడం వల్లే చనిపోతున్నాం" అని ఆ లేఖలో వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

సమాచారం అందుకున్న అంబర్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

Also Read :  ప్రముఖ వైద్యుడు ముళ్లపూడి వెంకటరత్నం కన్నుమూత

Advertisment
తాజా కథనాలు