Non-veg side effects: ప్రతిరోజూ మాంసం తింటున్నారా..? నాన్-వెజ్ ప్రియులు ఆరోగ్యంపై జాగ్రత్త
మాంసాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని పెంచి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఎర్ర మాంసంలో ఉండే సంతృప్త కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.