డేంజర్ జోన్లో దేశ రాజధాని.. తాత్కాలికంగా స్కూళ్లు, కాలేజీలు బంద్
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో తాత్కాలికంగా స్కూళ్లను మూసివేశారు. 10, 12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ సీఎం అతిశీ ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో తాత్కాలికంగా స్కూళ్లను మూసివేశారు. 10, 12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ సీఎం అతిశీ ఆదేశాలు జారీ చేశారు.
హైస్పీడ్ ఇంటర్నెట్ మనిషిలో కొవ్వు పెరగేలా చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏది కావాలన్నా ఆన్లైన్లోనే చేసేస్తున్నారు. శరీరానికి శ్రమ పెట్టడం లేదు. దీని వల్ల ఉబకాయం వస్తుందని.. మరెన్నో సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
మూత్రం తెల్లగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పవచ్చు. కొన్నిసార్లు ఇది పసుపు లేదా కొద్దిగా గోధుమ రంగులోకి మారుతుంది. మూత్రం ఎక్కువగా నురగలు వస్తుంటే దానిపై శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగితే నురుగు తక్కువగా వస్తుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.తీహార్ జైలులో ఉన్నప్పటి నుంచే కవిత పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
సౌత్ బీచ్ డైట్ ఇప్పుడు ట్రెండ్‌గా మారుతోంది. ఈ డైట్ ఫాలో అయితే 14 రోజుల్లో 6 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. సౌత్బీచ్ డైట్లో కాంప్లెక్స్ పిండి పదార్థాలు, లీన్ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, బీన్స్, చిక్కుళ్ళు ఉన్నాయి.
పారాసిటమల్ టాబ్లెట్స్ మనవాళికి చాలా ప్రమాదకరంగా మారుతున్నట్లు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. 'నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ' టెస్టులో 53 రకాల మందుల్లో నాణ్యత లేదని గుర్తించింది. ప్రభుత్వ రంగ సంస్థ 'HAL' మందుల్లోనూ క్వాలిటీ లోపించినట్లు పేర్కొంది.
కాలేయం శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. అయితే శరీరంలో ఫ్యాటీ లివర్ సమస్యను కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చు. తరచుగా కడుపులో నొప్పి, తీవ్రమైన అలసట, శరీరం పై దురద, కళ్ళ రంగు మారడం కాలేయ సమస్యలను సూచిస్తాయి.
హెయిర్ మాస్కులు వాడితే జుట్టు రాలే సమస్య కొంతమేర తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా పొడి జుట్టు ఉండే వారు వారానికి రెండు, మూడు సార్ల కన్నా ఎక్కువగా తలస్నానం చేయవద్దని సూచిస్తున్నారు. జగటగా, జిడ్డుగా అనిపిస్తేనే ప్రతీ రోజు హెడ్ బాత్ చేయాలని చెబుతున్నారు.
అమ్మాయిలు చిన్న గోళ్ల కారణంగా తరచుగా ఇబ్బంది పడుతుంటారు. నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల గోళ్ల ఎదుగుదల పెరుగుతుందా అనే ప్రశ్న కొందరిలో ఉంటుంది. అయితే నెయిల్ పాలిష్‌తో ప్రయోజనాలు, అప్రయోజనాలున్నాయి. ఈ పెయింట్ ఉపయోగించడం ద్వారా గోర్లు పెరుగుతాయని చెబుతున్నారు.